YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం దేశీయం

ఢిల్లీలో కాలుష్యంపై కేంద్రం, డిల్లీ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

ఢిల్లీలో కాలుష్యంపై కేంద్రం, డిల్లీ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

ఢిల్లీలో కాలుష్యంపై కేంద్రం, డిల్లీ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ 
: దేశ రాజధాని ఢిల్లీ తీవ్ర కాలుష్యం కోరల్లో చిక్కుకున్న నేపథ్యంలో కేంద్రం, ఆమాద్మీ పార్టీ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరస్పరం ఆరోపణలు చేసుకోవడం మాని కాలుష్య నివారణకు పరిష్కారం కనిపెట్టాలంటూ అక్షింతలు వేసింది. ‘‘జీవించే హక్కు అత్యంత ప్రాముఖ్యమైనదని’’ స్పష్టం చేసింది. ‘‘ప్రతి ఏటా కాలుష్యం కారణంగా ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కానీ మనం ఏమీ చేయలేకపోతున్నాం. ప్రతి సంవత్సరం 15 రోజుల పాటు ఈ పరిస్థితి వస్తోంది. నాగరికత గల దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. జీవించే హక్కు అత్యంత ప్రాముఖ్యమైనది..’’ అని జస్టిస్ అరుణ్ మిశ్రా పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం ప్రభుత్వం కలిసికట్టుగా కాలుష్యం నివారణకు కోసం పనిచేయాలని సూచించారు.‘‘నగరంలోని ఒక్క ఇంట్లో కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు. దీని కారణంగా ప్రతి సంవత్సరం విలువైన ప్రాణాలను కోల్పోతున్నాం...’’ అని జస్టిస్ మిశ్రా పేర్కొన్నారు. పంజాబ్, హర్యానాలో రైతులు చెత్త తగలబెట్టకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ధర్మాసనం సూచించింది.

Related Posts