ఘనంగా స్వామివారి పుష్పయాగం
తిరుమల
తిరుమలలో స్వామివారి పుష్పయాగం కోసం వినియోగించే పలురకాల పుష్పాలను ఊరేగింపు వేడుకగా జరిగింది.అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులను కటాక్షిస్తూ అలసిన స్వామివారికి సుగందం వెదజల్లే పుష్పాలతో యాగం చెయ్యడం ఆనవాయితీగా వస్తోంది అలాంటి వేడుక నేడు తిరుమలలో అంగ రంగ వైభవంగా నిర్వహించారు.
పాపవినాశనంకు వెళ్లే మార్గంలో ఉండే టీటీడీ పుష్పవిభాగం నుండి పుష్పయాగానికి వినియోగించే 12 రకాలపువ్వులు,6రకాల ఆకులు మొత్తం ఏడు టన్నుల పూలను ఊరేగింపుగా స్వామి వారి సన్నిధికి తీసుకువచ్చారు.అలా తీసుకొచ్చిన వివిధారకల పుష్పాలతో స్వామివారికి పుష్పయాగాన్ని టీటీడీ ఆగమోక్తంగా నిర్వహించింది..బ్రహ్మోత్సవాలలో భాగంగ తిరువీధులలో తిరిగి భక్తులను కటక్షిస్తూ అలసిన స్వామి,అమ్మవార్లకు వివిధారకల సుగంధాలు వెదజల్లే పుష్పలతో పుష్పయాగం నిర్వహిస్తోంది టీటీడీ. సంపంగి, మరువం, దమనం, చామంతి, విరజాజి, గులాబి వంటి12 రకాల పుష్పాలతో పాటు ఆరు రకాల ఆకులు మొత్తం 18రకాలు ఈ పుష్పయాగంలో వినియోగించారు.
పుష్పయాగం సందర్భంగా టీటీడీ పలు ఆర్జిత సేవలను నిలివేసింది.
దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని 15వ శతాబ్దం నుంచి ఈ పుష్పయాగ మహోత్సవాన్ని పూర్వం చేవారని శాసనాలు ద్వారా తెలుస్తున్నాయి. పూర్వపురోజుల్లో బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం జరిగిన ఏడో రోజు స్వామికి పుష్పయాగం చేసేవారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆ తరువాత నిలిచిపోయిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని 1980, నవంబరు 14న టిటిడి పునరుద్ధరించి ప్రతి ఏటా కార్తీక మాసం శ్రవణా నక్షత్ర పర్వదినాన నిర్వహిస్తోంది.....ఈ కార్యక్రమంలో భక్తులు టీటీడీ అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.