YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఎస్ బదిలీపై  విమర్శల వెల్లువ

సీఎస్ బదిలీపై  విమర్శల వెల్లువ

సీఎస్ బదిలీపై  విమర్శల వెల్లువ
విజయవాడ,
ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని జగన్ సర్కారు అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అప్పటి ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా స్థానంలో ఎల్వీని ఎన్నికల సంఘం నియమించింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యాన్నే సీఎస్‌గా కొనసాగించారు. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలు సీఎస్‌పై ప్రశంసలు గుప్పించారు. కానీ అనూహ్యంగా జగన్ సర్కారు ఆయన్ను ఎందుకు బదిలీ చేసిందనే ప్రశ్న రాజకీయ నేతలతోపాటు సామాన్యుల్లో సైతం తలెత్తుతోంది.కోరి తెచ్చుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు బదిలీ చేశారో చెప్పారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. జగన్‌ సర్కారును ప్రశ్నించారు. టీడీపీ నేతలు సైతం ఇదే ప్రశ్న సంధిస్తున్నారు. ఇందుకు కారణాల గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కీలక నిర్ణయాల విషయంలో సీఎం జగన్, సీఎస్ మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తినట్టు సమాచారం.స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని జగన్ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై భేటీ జరుగుతున్నప్పుడు.. ఓ అధికారిణి సీఎం నిర్ణయంతో విబేధించారట. స్థానికులకే 75 శాతం ఉద్యోవకాశాలు కల్పిస్తే.. పరిశ్రమలు రావని.. ఇప్పటికే ఏర్పాటైన పరిశ్రమలు తరలిపోతాయని ఆమె అభిప్రాయపడ్డారట. సీఎస్ ఆమెను ఆపారు కానీ.. గట్టిగా మాట్లాడలేదనే భావన సీఎంలో ఏర్పడిందట.అనంతరం పాఠశాలల్లో పని చేస్తున్న్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు విషయంలోనూ.. జగన్‌తో ఎల్వీ విబేధించారట. మధ్యలో ఆర్థిక మంత్రి బుగ్గన జోక్యం చేసుకుని సీఎంకు సర్ది చెప్పారని అప్పట్లోనే ప్రచారం జరిగింది.జగన్ సర్కారు 25 లక్షల మందికి ఉగాది పర్వదినాన ఇళ్లపట్టాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. కానీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాత్రం ఇళ్ల స్థలాల కంటే చెత్తను పడేసేందుకు డంపింగ్ యార్డుల కోసం స్థలాలను గుర్తించడమే ముఖ్యమని భావించారట. ఈ విషయం జగన్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. టీటీడీలో అన్యమత ప్రచారాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలే ఎల్వీఎస్ కొంప ముంచాయా? అని ప్రతిపక్ష నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు
కార్నర్ గా మారిన  జగన్
చీఫ్ సెకట్రరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై జగన్ సర్కారు బదిలీ వేటు వేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కోరి తెచ్చుకున్న ఆయన్ను ఎందుకు బదిలీ చేశారంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా ఈ వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని జగన్ సర్కారు అనూహ్యంగా బదిలీ చేయడం పట్ల మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు.సీఎస్‌ను బదిలీ చేసే అధికారాలు సీఎంకు ఉన్నప్పటికీ.. తొలగించిన విధానం సరిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం దురదృష్టకరం అన్నారు. సర్వాధికారాలు ఉండి, ఎలాంటి బాధ్యతలు లేని ఇన్‌స్టిట్యూట్‌గా సీఎం కార్యాలయం మారిందని ఐవైఆర్ ఆరోపించారు.సీఎంవోను నియంత్రించడంలో విఫలమైన సీఎంలు పడిపోయారని.. పరోక్షంగా చంద్రబాబు నాయుణ్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రుల మెడ చుట్టూ ఉచ్చులా చుట్టుకుంటోందన్నారు. జగన్ సర్కారు కూడా ఇదే బాటలో సాగుతోందని అర్థం వచ్చేలా మాజీ సీఎస్ మాటలు ఉన్నాయి.హిందూ దేవాలయాల్లో అన్య మతస్తులను తొలగించే విషయంలో గట్టిగా నిలబడినందుకు ఇది బహుమానం అయితే ఇంకా మరీ దారుణం అంటూ ఐవైఆర్ కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు.

Related Posts