తహసీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి
రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సోమవారం సజీవ దహనమైన ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుండి విజయారెడ్డిని కాపాడే ప్రయత్నం చేసిన డ్రైవర్ గురునాథంకు 80శాతం వరకు గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం డీఆర్డీవో అపోలోలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురునాథం మంగళవారం ఉదయం చనిపోయాడు. గాయాల తీవ్రత అధికంగా ఉండటంతోనే ఆయన మరణించాడని వైద్య వర్గాలు వెల్లడించాయి.అతని స్వస్థలం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామం. గురునాథం గడచిన ఎనిమిది సంవత్సరాలుగా విజయారెడ్డి వద్దే డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గురునాధం మృతితో వెలిదండ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.