YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆర్టీసీ సమ్మె పై ముఖ్యమంత్రి అహంకార ధోరణి -  జిల్లా టిడిపి అధ్యక్షులు రాములు

ఆర్టీసీ సమ్మె పై ముఖ్యమంత్రి అహంకార ధోరణి -  జిల్లా టిడిపి అధ్యక్షులు రాములు

ఆర్టీసీ సమ్మె పై ముఖ్యమంత్రి అహంకార ధోరణి
-  జిల్లా టిడిపి అధ్యక్షులు రాములు
వనపర్తి  
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ అహంకార ధోరణి విడనాడి రాష్ట్ర పెద్దగా కార్మికులతో చర్చించి వీలైనన్ని డిమాండ్లను పరిష్కరించాలని తెలుగుదేశం వనపర్తి జిల్లా అధ్యక్షులు బి రాములు కోరారు .మంగళవారం వనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు పలు ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టు మొట్టికాయలు వేసినా ముఖ్యమంత్రి మారకపోవడం విచారకరమన్నారు .గత  ముప్పై రెండు రోజులుగా వారు సమ్మె చేస్తున్నారని  పిలిచి చర్చించకుండా భేషరతుగా 5వ తేదీ అర్ధరాత్రి లోగా విధులలో చేరుకుంటే ఉద్యోగాలు పోతాయని బెదిరించడం తగదని హితవు పలికారు. వారేమైనా శత్రువు లా అని ప్రశ్నించారు . ముఖ్యమంత్రి అహంకార పూరిత మాటల వల్ల ఇప్పటికే కొందరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకోగా మరికొందరు గుండెపోటుతో మరణించారు అని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి ఇంటి నౌకర్ల లాగా చూస్తున్నారని తప్పు పట్టారు .వారికి చట్టాలు హక్కులు ఉన్నాయని గుర్తు చేశారు. టిఆర్ఎస్ ఎంఐఎం మినహ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజలు ఆర్టీసీ కార్మికుల వెంట ఉన్నారని తెలిపారు. సమ్మెకు రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నారు తప్ప రెచ్చగొట్టడం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి కార్మికులను రెచ్చగొట్టేలా భయభ్రాంతులను చేసేలా మాట్లాడుతు ఉన్నారని ఆరోపించారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మంత్రులు కొందరు కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా  అతిగా మాట్లాడుతున్నారని తెలిపారు .ఉద్యోగులు అంటే చులకన భావం తగదన్నారు. రెవెన్యూ వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తాం అంటున్నారని వారిలో అభద్రతాభావం భయం ఏర్పడిందన్నారు. భూ ప్రక్షాళన పేరుతో చేపట్టిన కార్యక్రమం ఇప్పటికీ గందరగోళంగానే ఉందన్నారు. దానికి పరాకాష్ట అబ్దుల్లాపూర్మెట్ తాసిల్దార్ విజయ రెడ్డి హత్య అని తెలిపారు. హత్యను ఖండించి వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు .ఇలాంటివి జరగకుండా భద్రత కల్పించాలని తెలిపారు .ఎన్నికల్లో ఇచ్చిన చాలా హామీలు నెరవేర్చలేదని రైతుబంధు ఖరీఫ్ సాయం నవంబర్ వచ్చిన రైతుల అకౌంట్లో పడలేదని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన ఆయన రైతులను పోషిస్తున్నట్టు మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకట యాదవ్ మాట్లాడుతూ రైతులకు 24 గంటల కరెంటు సక్రమంగా అందడం లేదని విమర్శించారు. ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియడం లేదన్నారు .పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు నందిమల్ల అశోక్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ బలిదానాల తెలంగాణ గా మారిందని విమర్శించారు. 20 మందికిపైగా ఆర్టీసీ కార్మికులు చనిపోయారని,23 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారని, dengu వ్యాధితో ప్రజలు మృత్యువాత పడుతున్నారని విమర్శించారు. మైనార్టీ నాయకుడు దస్తగిరి మాట్లాడుతూ అసదుద్దీన్ ఓవైసీ తన స్వార్థం కోసం ముఖ్యమంత్రికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. సుమారు పదివేల మంది మైనారిటీ కార్మికులు ఆర్టీసీలో పని చేస్తున్నారని, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని చెప్పాల్సింది పోయి విధుల్లో చేరాలని సలహాలివ్వడం గర్హనీయమని విమర్శించారు. నాయకులు నందిమల్ల రమేష్ కాగితాల లక్ష్మయ్య వహీద్ ఆవుల శ్రీను గౌస్ సింగిల్ విండో డైరెక్టరీ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts