Highlights
- విభజన హామీలను నెరవేర్చడంలో మోదీ విఫలం
- నోట్ల రద్దు, జీఎస్టీతో ఇప్పటికే మోదీ ప్రభ తగ్గింది
- టీడీపీ విడిపోవడంతో ఎన్డీయే పతనం ఆరంభం
- జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ
ప్రధాని నరేంద్రమోదీ హవా రోజురోజుకు కుంచించుకుపోతోందని మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ పేర్కొన్నారు. ఏపీ హామీల విషయంలో మోదీ యూటర్న్ తీసుకోవడం ద్వారా జాతీయస్థాయిలో కొత్త కూటములకు అవకాశం ఇచ్చినట్టు అయిందని దేవెగౌడ అభిప్రాయపడ్డారు. నాలుగేళ్లయినా హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని, ప్రత్యేక ప్యాకేజీని కూడా వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడంతో జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉందన్నారు.ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు రావడంతో మోదీ ప్రాభవానికి ఇక బీటలు వారినట్టేనన్నారు. .ఏపీకి ఇచ్చిన హామీల విషయంలో మోదీ వెనక్కి తగ్గారని విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీతో మోదీ ప్రభ బాగా మసకబారిందని, ఇప్పుడు టీడీపీ బయటకు రావడంతో మరింత దెబ్బ తగలడం ఖాయమని అన్నారు.