విశాఖ జిల్లా నర్సీపట్నం అరటి గెలల మాటున గంజాయి రవాణా
725 కిలోల గంజాయి పట్టవేత
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు అరెస్టు
రెండు సెల్ ఫోన్లు స్వాధీనం
లారీ సీజ్
విశాఖపట్నం
గంజాయి రవాణా చేసేందుకు స్మగ్లర్లు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటే.... దానిని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు వాటిని చిత్తు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిన్న పైకి ఫ్లైవుడ్ మాదిరిగా పైకి భ్రమింపజేసి, లోన ఒక పెట్టె మాదిరిగా చేసి దానిలో గంజాయి ప్యాకెట్ లను వేసి తరలిస్తున్న వ్యాన్ ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సంఘటన జరిగి 24 గంటలు గడవక ముందే అరటి గెలల మాటున లారీలో తరలిస్తున్న గంజాయి ని పట్టుకున్నారు. ఈ రోజు ఉదయం అనకాపల్లికి చెందిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ యస్.ఐ, మరియు సిబ్బంది నర్సీపట్నం ప్రొహిబిషన్& ఎక్సయిజ్అధికారులు సిబ్బంది సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో నర్సీపట్నం మండలం డిగ్రీ కాలేజీ వద్ద అరటి గెలలతో వెళ్తన్న లారీని చూసి, అనుమానంతో తనిఖీ చేసిన అధికారులకు 29బస్తాలలో,ఒక్కో బస్తాలో 21కిలో ల చొప్పున తరలిస్తున్న గంజాయి కనిపించింది. దీంతో లారీని స్థానిక ఎక్సైజ్ స్టేషన్ వద్దకు తీసుకెళ్ళి లారీలో ఉన్న 29 మూటల గంజాయిని దించి, తూకం వేయగా 725 కిలోలు వచ్చింది. దీని విలువ సుమారుగా రూ. 35 లక్షల వరకు వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దర్ని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని లారీని సీజ్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు.