అమ్మ ఒడి పథకంలో మార్పులు
అమరావతి
ప్రభుత్వం అమ్మఒడిపథకంలో కీలక మార్పులు చేసింది. అమ్మఒడి కింద పిల్లలతో సంబంధం లేకుండా తల్లి, గార్డియన్ కేంద్రంగా రూ.15వేలు చెల్లించనున్నారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాల అమలుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మార్గదర్శకాలు
⦁ విద్యార్థులకు 75% హాజరు ఉండాలి.
⦁ స్వచ్ఛంద సంస్థల్లో చదివే అనాథలు, వీధిబాలలకు సంబంధించి ఆయా శాఖలతో సంప్రదించి చెల్లిస్తారు.
⦁ విద్యాసంవత్సరం మధ్యలో చదువు మానేసిన పిల్లలు అనర్హులు.
⦁ కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు, పింఛన్దారులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అనర్హులు.
⦁ విద్యార్థి తల్లి బ్యాంకు, తపాల ఖాతాకు ప్రతి ఏడాది జనవరిలో రూ.15 వేలు ఆన్లైన్ లో చెల్లిస్తారు.
⦁ దీనికోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక వెబ్సైట్ ని రూపొందిస్తోంది.
⦁ విద్యార్థి తల్లి వివరాలను విద్యాసంస్థలు సేకరిస్తాయి. వీటిని డేటా, పౌరసరఫరాల శాఖ , ఇతర విభాగాలతో సరిపోల్చి చూస్తారు.
⦁ రేషన్ కార్డు లేనివారికీ ఈ పథకం వర్తించనుంది