మత పెద్దలతో డిఎస్పి రామకృష్ణ శాంతి సమావేశం
ఎమ్మిగనూరు
పట్టణ,గ్రామాల్లో ప్రజలు మిలాదున్ నబి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆదోని డిఎస్పి రామకృష్ణ తెలిపారు. పట్టణంలోని పీస్ కమిటీ సభ్యులతో మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ ఎస్పీ పక్కీరప్పకాగినెల్లి ఆదేశాల మేరకు కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.ఈ నెలలో సుప్రీంకోర్టు అయోధ్య భూ వివాదం కేసును మరో 7 రోజులలో వెలువరించనున్న నేపథ్యంలో సామాజిక,మత,రాజకీయ వర్గాల ప్రజలు శాంతియుత వాతావరణానికి సహకరించాలని కోరారు.న్యాయస్థానం ఇచ్చే తీర్పును ప్రజలు స్వీకరించాలని,ప్రతి ఒక్కరు శాంతి భద్రతలను కాపాడటంలో భాద్యత తీసుకోవాలన్నారు.కోర్టు తీర్పును కాదని ఎవరైనా గొడవలకు పాల్పడినా,చట్ట వ్యతిరేక చర్యలకు పూనుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అన్ని మతాలపై తగిన అభిమానం,సోదర భావంతో ఉండాలని సూచించారు.కార్యక్రమంలో సిఐలు శ్రీధర్,మహేశ్వరరెడ్డి,ఎస్ఐ లు శ్రీనివాసులు,రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.