కేసీఆర్ పై మండిపడ్డ రేణుకా చౌదరి
ఖమ్మం
కేసీఆర్ పై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మండిపడ్డారు. .తెలంగాణా రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని అన్నారు. ప్రజా స్వామ్యంలో అధికారులపై జరుగుతున్న పాశవిక దాడులపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మంగళవారం నాడు ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ రాష్టంలో శాంతి భద్రతలు క్షిణిస్తున్నాయని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో మహిళ తహసీల్దార్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ఆమే ... కక్షపూరిత ధోరణి విడనాడాలని విజ్నప్తి చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ప్రజారవాణాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని అన్నారు. అంగతకుడి దాడిలో మృతి చెందిన అధికారికి కాంగ్రెస్ నేతలు కొవ్వోత్తులతో శ్రద్దాంజలి ఘటించారు.