YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ విదేశీయం

కువైట్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ, దీపావళి ,సంబరాలు 

కువైట్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ, దీపావళి ,సంబరాలు 

కువైట్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ, దీపావళి ,సంబరాలు 
జగిత్యాల 
తెలంగాణ జాగృతి కువైట్ శాఖ ఆధ్వర్యంలో కువైట్ లోని ఇండియన్ స్కూల్ లో బతుకమ్మ, దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు . మహిళలంతా బతుకమ్మ ఆట,పాటలతో ఎంతో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ జాగృతి గల్ఫ్ అధ్యక్షులు చిలంశెట్టి హరిప్రసాద్ , సినీ నటులు సంపూర్ణేష్ బాబు , జానపద గీత రచయిత, గాయకులు మాట్ల తిరుపతి , గాయని పారిజాత , కువైట్ లోని ప్రముఖ అరబిక్ సింగర్ ముబారక్ అల్ రషీద్ , తెలంగాణ కువైట్ జాగృతి అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్ ,  రాజన్నా.మమిడిపేల్లి, మోహమ్మద్.సైఫుద్ధీన్, ప్రమోద్ మార్క,వారం రాజశేఖర్, కిరణ్, లావన్,శ్రీను, మామిడల రత్నకర్,మరియు స్థానిక అతిథుల చేత జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో ప్రతి తెలంగాణ బిడ్డ బతుకమ్మ, సంబరాలలో ఉత్సాహంతో పాల్గోని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జానపద గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు, బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో మరెన్నో ఇటువంటి కార్యక్రమాలను తెలంగాణ బిడ్డలుగా కలిసికట్టుగా జరుపుకుందామని గల్ఫ్ తెలంగాణ జాగృతి అధ్యక్షుడు చిలం శెట్టి హరి ప్రసాద్ , కువైట్ జాగృతి అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్ పిలుపునిచ్చారు.

Related Posts