YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జాతీయపార్టీ వైపు గంటా చూపు

జాతీయపార్టీ వైపు గంటా చూపు

జాతీయపార్టీ వైపు గంటా చూపు
విశాఖపట్టణం, 
విశాఖ జిల్లా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆలోచనలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. ఆయన టీడీపీలో పుట్టి పెరిగి అప్పట్లో ఒక్కసారిగా ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. ఆనాడు కూడా గంటా శ్రీనివాసరావు ఆఖరి నిముషం వరకూ తాను టీడీపీలోనే ఉంటానని చెప్పి లాస్ట్ లో మెగా పార్టీ కండువా కప్పేసుకున్నారు. ఇక అక్కడ నుంచి కాంగ్రెస్ ఆ మీదట 2014 ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ ఇలా రెండు దశాబ్దాల గంటా శ్రీనివాసరావు రాజకీయ జీవితంలో నాలుగు పార్టీలు మారిన చరిత్రను సొంతం చేసుకున్నారు. ఇక 2019 ఎన్నికల ముందు సెంటిమెంట్ గా పార్టీ మారాల్సి ఉన్నా వీలులేక ఆయన జంప్ చేయలేకపోయరని అంటారు. ఇపుడు ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ ఓడిపోవడంతో గంటా శ్రీనివాసరావు చూపు ఇతర పార్టీల మీద ఉందని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇక ఆయన వైసీపీ, బీజేపీ ఇలా రెండు పార్టీలతో దాగుడుమూతలు ఆడుతున్నారు. కానీ చివరికి గంటా శ్రీనివాసరావు మనసు కమలం వైపే మొగ్గుతోందని తాజా సమాచారం.బీజేపీలోకి వెళ్తే జాతీయ పార్టీలో ఉన్నట్లుగా ఉంటుందని, ఏపీలో కాకపోయినా కేంద్రంలో అయినా తగిన గుర్తింపు పదవులు లభిస్తాయని గంటా శ్రీనివాసరావు బ్యాచ్ భావిస్తోందట. ఇక ఏపీలో చూసుకుంటే జగన్ పార్టీలో చేరినా కూడా మంత్రి పదవి డౌటేనని అంటున్నారు. పైగా జగన్ తో ఎంతవరకూ పొసుగుతుంది అన్నది కూడా గంటా శ్రీనివాసరావు వర్గం ఆలోచనగా ఉందిట. జగన్ దగ్గర పూర్తి స్వేచ్చ ఉండదని కూడా భావిస్తున్నారుట. మరో వైపు చూసుకుంటే జగన్ కి ఇప్పటికిపుడు సమస్యలు లేకపోయినా రాజకీయంగా ఆయనన్ని టార్గెట్ చేసేందుకు ఏపీలో అన్ని పార్టీలు రెడీగా ఉన్నాయని అందువల్ల జగన్ పార్టీలో చేరినా కూడా తామూ టార్గెట్ అవుతామన్న ముందస్తు జాగ్రత్త కూడా గంటా శ్రీనివాసరావు వర్గంలో ఉందని చెబుతున్నారు.ఇక రాజ్యసభ సీటు కోసం బీజేపీలో రాయబేరాలు జరుగుతున్నాయని అంటున్నారు. అలా కనుక బీజేపీ హై కమాండ్ అంగీకరిస్తే మాత్రం గంటా శ్రీనివాసరావు ఈ క్షణమే పార్టీకి రాజీనామా చేస్తారని చెబుతున్నారు. ఎమ్మెల్యే పదవికి కూడా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేస్తే అక్కడ నుంచి బీజేపీ మాజీ శాసన‌నసభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు పోటీ చేస్తారని, ఆయన్ని గెలిపించడం కూడా గంటా శ్రీనివాసరావు మీదనే ఆధారపడి ఉందని అంటున్నారు. ఇలా ఉభయతారకంగా ఒప్పందం కుదిరితే కనుక బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీకి వస్తారు,గంటా శ్రీనివాసరావు రాజ్యసభకు వెళ్తారని చెబుతున్నారు. మరో వైపు ఏపీ బీజేపీలో కీలకమైన బాధ్యతలు కూడా తనకే అప్పగించాలని గంటా శ్రీనివాసరావు అడుగుతున్నారట. అదే జరిగితే తనతో పాటు పెద్ద బ్యాచ్ నే బీజేపీలో చేర్చెలా చూస్తానని అంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అన్నీ కనుక కుదిరితే మాత్రం తోందరలోనే గంటా శ్రీనివాసరావు కాషాయం కండువా కప్పుకోవడం ఖాయమని అంటున్నారు మరి చూడాలి. ఏం జరుగుతుందో.

Related Posts