YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ మార్క్ పాలిటిక్స్ షురూ....

జగన్ మార్క్ పాలిటిక్స్ షురూ....

జగన్ మార్క్ పాలిటిక్స్ షురూ....
విశాఖపట్టణం, 
రాజకీయలంటే అంతే మరి. ఇక అధికారం తోడైతే ఆ రాజకీయ దూకుడుని అసలు పట్టలేం. విశాఖ వేదికగా జగన్ మీద విరుచుకుపడిన ఇద్దరు నేతలకు జగన్ తన స్టయిల్లో షాక్ తినిపించేస్తున్నారు. ఎంతైనా జగన్ పొలిటికల్ గా ఢక్కామెక్కీలు తిన్న వారు కదా. విశాఖలో ఉన్న పిచ్చాసుపత్రిలో ఒక పిచ్చోడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే జగన్ కన్నా బాగా పాలిస్తాడంటూ అయ్యన్నపాత్రుడు డామేజింగ్ స్టేట్మెంట్స్ వదిలారు. ఇక పవన్ అయితే జగన్ నిఅసలు లెక్కచేయడంలేదు. దాంతో జగన్ మార్క్ పాలిట్రిక్స్ స్టార్ట్ చేశారు. ముందుగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి గట్టి ఝలక్ ఇచ్చారు. ముహూర్తం పెట్టి మరీ అయ్యన్న పాత్రుడి తమ్ముడిని వైసీపీలో కలిపేసుకున్నారు.
అయ్యన్నపాత్రుడు జగన్ మీద చెలరేగి మాట్లాడి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు…అయ్యన్నపాత్రుడు తమ్ముడు సన్యాసిపాత్రుడి తెల్లారుతూనే వెళ్ళి జగన్ ఇంటి ముంగిట నిలబడ్డారు. తన భార్య నర్శీపట్నం మునిసిపలిటీ మాజీ చైర్ పర్సన్ అయిన అనితతో పాటు పలువురు మాజీ కార్పోరేటర్లతో కలసి అయ్యన్న తమ్ముడు వైసీపీ కండువా కప్పేసుకున్నారు. ఆ విధంగా జగన్ పెద్ద దెబ్బ వేశారు. నర్శీపట్నం మునిసిపాలిటీలో సన్యాసిపాత్రుడికి మంచి పట్టు ఉంది. అందువల్ల వారి సహకారం తీసుకుని అయ్యన్నపాత్రుడికి అక్కడే షాక్ తినిపించాలని జగన్ వేసిన ఎత్తుగడగా ఉంది. నిజానికి అయ్యన్నపాత్రుడు తమ్ముడు ఎపుడో పార్టీలో చేరాలి. అది అలా వాయిదా పడుతూ వస్తోంది. ఇపుడు అయ్యన్నపాత్రుడు నోటి దురుసుకు ఇదే సరైన సమాధానం అన్నట్లుగా జగన్ ఇలా గట్టి ట్రీట్ మెంట్ ఇచ్చారని విశాఖ రాజాకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. జగన్ ఇంతటితో ఆగరని, రానున్న రోజుల్లో ఈ మాజీ మంత్రికి బలమైన వర్గం అంటూ లేకుండా చేసేందుకు సర్వ శక్తులు ఒడ్డుతారని అంటున్నారు. అంటే అయ్యన్నపాత్రుడు టార్గెట్ అయ్యారన్న మాటే.
ఇక పవన్ లాంగ్ మార్చ్ విశాఖలో అన్నారో లేదో జగన్ ఆయన పార్టీ నుంచి ఓ సీనియర్ని లాగేందుకు రెడీ అయిపోయారు. నిజానికి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు వైసీపీలోనే మొదట చేరాలి. ఆయన్ని అరకు ఎంపీగా పంపుతానని జగన్ అనడంతో ఆయన పాడేరు అసెంబ్లీ టికెట్ కోసమే జనసేనలో చేరారు. పవన్ గ్లామర్ తన బలం కలసి గెలుస్తానని లెక్కలు కట్టారు కానీ ఓడిపోయారు. ఇపుడు ఆయన్ని జగనే రమ్మంటున్నారు. అదీ పవన్ విశాఖలో అడుగుపెట్టిన వేళ బాలరాజు రాజీనామా చేసేలా కధ నడిచింది. ఇపుడు బాలరాజు కూడా రేపో మాపో వైసీపీలో చేరుతారని అంటున్నారు. ఆయన‌తో పాటు గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్యను కూడా వైసీపీలోకి తీసుకోవడానికి జగన్ రెడీ అవుతున్నారు. మరో వైపు జనసేనలో అరకొరగా మిగిలిన నాయకులను ఏపీ వ్యాప్తంగా లాగేసే ప్రొగ్రాం మొదలైందని కూడా టాక్ వినిపిస్తోంది

Related Posts