YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

125 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

Highlights

  • వాతావరణంలో అనూహ్య మార్పులు
  • రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు 
  • గంటకి 55 కి.మీ.వేగంతో గాలులు
  • రైతన్నలను దడపుట్టిస్తున్నవాతావరణ పరిస్థితులు
 125 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

 
ఈ ఏడాది వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అరేబియా సముద్రం మీదుగా అరుదైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.1891వ సంవత్సరం నుంచి అరేబియా సముద్రంలో వాతావరణానికి సంబంధించిన రికార్డుల్ని పరిశీలిస్తే మార్చి నెలలోనే అల్పపీడనం ఏర్పడడం ఇదే మొదటిసారని వారు తేల్చి చెప్పారు.దీని ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనాలున్నాయి. కొంకణ్, సెంట్రల్‌ మహారాష్ట్ర, విదర్భ, మరఠ్వాడా ప్రాంతాల్లో వడగళ్ల వానలు కూడా కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం కారణంగావీస్తున్న బలమైన గాలులు లక్షద్వీప్, కేరళను చుట్టుముట్టాయి. గంటకి 55 కి.మీ.వేగంతో గాలులు వీస్తున్నాయి. ముంబై, పుణె, నాసిక్‌లలో ఇప్పటికే మబ్బుపట్టిన వాతావరణం, చిరుజల్లులు ప్రజల్ని సేద తీరుస్తున్నాయి. కానీ ఇప్పటికే నిండా అప్పుల్లో మునిగిపోయిన రైతన్నలకు ఈ వాతావరణ పరిస్థితులు దడపుట్టిస్తున్నాయి. రబీ పంటల సమయంలో వాతావరణంలో ఇలాంటి మార్పులు, అకాలవర్షాల వల్ల రైతులకు ఎంత నష్టం వాటిల్లుతుందోనన్న ఆందోళనలు నెలకొన్నాయి.ఎండలు ఠారెత్తిస్తున్నప్పుడు, ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి చేరుకున్నప్పుడు అల్పపీడనాలు ఏర్పడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవడం సాధారణమైన విషయం. కానీ మార్చి నెలలోనే, ఇంకా అంతగా ఎండలు ముదరకుండానే అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ముంబైలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) వెల్లడించింది. సర్వసాధారణంగా అరేబియా సముద్రంలో ఏప్రిల్, మే నెలల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి.కానీ ఈ సారి మార్చిలోనే ఈ పరిస్థితి రావడం అత్యంత అరుదైనదని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 125 సంవత్సరాల్లో ఈ తరహా వాతావరణాన్ని చూడడం ఇదే తొలిసారని అంటున్నారు. రబీ పంటల సమయంలో వాతావరణంలో ఇలాంటి మార్పులు, అకాలవర్షాల వల్ల రైతులకు ఎంత నష్టం వాటిల్లుతుందోనన్న ఆందోళనలు నెలకొన్నాయి.

Related Posts