YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైకాపా హయంలో నిధులు వెనక్కిపోయాయి అమరావతిని పరిశీలించిన టీడీపీ బృందం

వైకాపా హయంలో నిధులు వెనక్కిపోయాయి అమరావతిని పరిశీలించిన టీడీపీ బృందం

వైకాపా హయంలో నిధులు వెనక్కిపోయాయి
అమరావతిని పరిశీలించిన టీడీపీ బృందం
అమరావతి నవంబర్ 6,
బుధవరం నాడు టిడిపి నాయకులు  రాజధాని అమరావతిలో పర్యటించారు. చంద్రబాబు నివాసం నుంచి రాజధాని పర్యటనకు ప్రత్యేక  బస్సులో మాజీ మంత్రులు, టిడిపి నేతలు బయలుదేరి పలు ప్రాంతాలను పరిశీలించారు. గుంటూరు ఎంపీ గల్లా.జయదేవ్, మాజీ మంత్రులు నారాయణ, దేవినేని ఉమా, అచ్చెం నాయుడు, ఎమ్మెల్సీలు  లు అశోక్ బాబు, రామకృష్ణ, ఎమ్మెల్యే  మద్దాల గిరి, టిడిపి నేతలు పంచుమర్తి అనురాధ, జివి ఆంజనేయులు, పట్టాబి బృందంలో వున్నారు. ఎంపి గల్లా జయదేవ్ మాట్లాడుతూ పది  హైదరాబాదులోనే ఉంటే అభివృద్ధి కుంటుపడుతుందని అమరావతికి తీసుకొచ్చారు చంద్రబాబు. అన్ని జిల్లాలకు యాక్సిస్ ఉంటుందని అమరావతిని రాజధానిగా నిర్ధారించాం. నదీపరీవాహక ప్రాంతంలో రాజధాని కడితే చాలా సుందరమైన సిటీ అవుతుందని అన్నారు. చంద్రబాబుకు ఉన్న క్రెడిబిలిటీతో ఫండ్స్ వచ్చాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక రావలసిన నిధులు వెనక్కి పోయాయి, రాష్ట్రానికి అప్పు ఇస్తామన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. హైదరాబాదు అభివృద్ధి చూస్తేనే ఎలా ఉంటుందో తెలుస్తుంది. చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణను నమ్మి, 35వేల ఎకరాల భూమి ఇచ్చారు. రైతులందరూ ఇప్పుడు ఏమవ్వాలని ప్రశ్నించారు. ఐఎఎస్ ల క్వార్టర్ల నిర్మాణం లక్ష యాభైవేల చదరపు గజాల నిర్మాణం పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణం విషయంలో అమరావతి పేరు అసలు పలకలేదు. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర భవిష్యత్తు గురించి అమరావతి అవసరం అని తెలియదా అని అడిగారు. ఎమ్మెల్యే అచ్చంనాయుడు మాట్లడుతూ అమరావతిలో రాజధాని నిర్మాణాలు జరిగాయనడానికి ఎంఎల్ఏ క్వార్టర్స్ ఒక నిదర్శనం. బొత్స సత్యనారాయణ కారులో నేను కూడా వస్తాను, మొత్తం నిర్మాణాలు బొత్స సత్తిబాబుకు చూపిస్తా. ఎక్కడో రంగులేసుకోవడం కాదు, ఇక్కడ రంగులేస్తే చాలు ఉపయోగించుకోవచ్చు. అసెంబ్లీకి ఐదు నిముషాల దూరంలో ఉన్నాం. ఢిల్లీ వెళ్ళి టిడిపి పనులు చేసింది డబ్బులిమ్మని జగన్ అడుక్కుంటున్నాడని విమర్శించారు. అమరావతిలో ఇటుక కూడా వేయలేదని సిగ్గుమాలిన మాటలు మాట్లాటుతున్నారు వైసిపి మంత్రులు. పనులే జరగలేదనటానికి బొత్స సత్తిబాబుది నోరా తాటిమట్టా అని అడిగారు. రాజధాని నిర్మాణాలు జరుగుతున్నాయని నిరూపిస్తున్నామని అయన అన్నారు.

Related Posts