YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

చిన్నారులపై కుక్కల దాడి

చిన్నారులపై కుక్కల దాడి

చిన్నారులపై కుక్కల దాడి
రంగారెడ్డి నవంబర్ 6, 
మొన్న సురారం, నిన్న దుండిగల్, నేడు చింతల్...ఒక పక్క డెంగ్యూ, మరోపక్క కుక్కల దాడీ..ఇలా ప్రతిరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జనాలపై  కుక్కల దాడీ సర్వసాధారణం అయ్యింది. ఇంత జరుగుతున్నా కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం వెటర్నరీ అధికారుల జాడ లేదు. చిన్నారులు ఇంటినుండి బయటకు వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తారనే నమ్మకం లేకుండా పోయింది. తాజాగా చింతల్, ప్రసూన్న నగర్ లో ఏడుగురు చిన్నారులపై కుక్కల దాడి చేసాయి..ప్రసూన్న నగర్ లో వివిధ స్కూల్ లలో చదువుతున్న  గ్యానేశ్వర్(7), హరిణి(5), శ్వాతి(6), లీనా(6), విజ్ఞాన్(5), శ్రవణ్(7), శంకర్(8) విద్యార్థులు స్కూల్ నుండి ఇంటికి వెల్తుండగా మార్గమద్యంలో వీధి కుక్కలు ఈ చిన్నారులపై దాడి చేసి చేతులు, కాళ్ళపై కరిచాయి. లీనా అనే చిన్నారి షాపు నుండి పాల ప్యాకెట్ కొని తెస్తుంటే కుక్క దాడి చేసి కుడి కాలును కరిచింది. ఈ చిన్నారులకు కుక్కల పన్ను, గోర్ల గాట్లు పడి రక్తం కారడంతో తల్లిదండ్రులు చింతల్ లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కుక్కలు, పందులు తమ కాలనీలో ఎక్కువైయ్యాయని సంబంధిత అధికారులు వెంటనే వీటిని పట్టుకొని తమను రక్షించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Related Posts