కబ్జాలకు పాల్పడిన మల్ రెడ్డి కుటుంబం
రంగారెడ్డి నవంబర్ 6
అబ్దుల్లాపూర్ మెట్ భూములపై కావాలనే తనపై బురద జల్లుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆరోపించారు. నాలుగైదేళ్లగా భూమి దోచుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని, కాంగ్రెస్ నేత మల్ రెడ్డి బంధువులే ఆరుగురి పేర్లతో భూమి దోచుకున్నారని మంచిరెడ్డి ఆరోపిస్తున్నారు. వాస్తవాలేంటో పోలీసు విచారణలో తేలుతుందంటున్నారు మంచిరెడ్డి. . తనపై బురదజల్లి రాజకీయంగా లబ్ది పొందాలనే ఉద్దేశంతో మల్రెడ్డి రంగారెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. భూకబ్జాదారుడు ఎవరనేది నిరూపించేందుకు తన వద్ద అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు.బాచారంలోని సర్వే నం.70 నుంచి 101 వరకు ఉన్న 412 ఎకరాల భూముల్లో మల్రెడ్డి కుటుంబం కబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. సరైన డాక్యుమెంట్స్ లేకుండానే రైతులను భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కున్నారని పాస్బుక్స్ లేకపోయినా పహాణీలతోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని.. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా సీఎస్,డీజీపీలకు లేఖలు రాస్తున్నానని తెలిపారు. తనకు తాతలు,తండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తులు ఉన్నాయని.. అంతే తప్ప ఎన్నడూ ఎక్కడా కబ్జాలకు పాల్పడలేదని అన్నారు.మల్రెడ్డి ఎన్నో భూకబ్జాలకు పాల్పడ్డారని అంబర్ పేట్ ఓఆర్ఆర్ పక్కన సర్వే నం.230-233 వరకు ఉన్న 16 ఎకరాల భూమిని మల్రెడ్డి, రామ్రెడ్డి,సంజీవరెడ్డి ముగ్గురు కలిసి కబ్జా చేశారని ఆరోపించారు. దాని విలువ రూ.100 కోట్లు ఉంటుందని కేవలం పహాణీ డాక్యుమెంట్స్తో ఆ భూమిని రిజిస్టర్ చేయించుకుని కాంపౌండ్ వాల్ కట్టేశారని ఆరోపించారు. మల్రెడ్డికి తండ్రి ద్వారా సంక్రమించింది కేవలం రెండెకరాలేనని కానీ ఇప్పుడు ఇంత స్థాయిలో భూములు సంపాదించేందుకు సంపాదన ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.