రూ 2 లక్షల విలువగల నకిలీ క్రిమిసంహారక మందులు స్వాధీనం…ఒకరి అరెస్ట్
సూర్యాపేట
జిల్లాలో నకిలీ క్రిమిసంహారక మందులు పట్టివేత కలకలం సృష్టించింది. స్థానికులు ఇచ్చిన సమాచారము మేరకు చివ్వేంల మండలం బిబిగూడెం వద్ద మూసివేసిన హోటల్ నందు అక్రమంగా తయారీ చేస్తున్న నకిలీ క్రిమిసంహారక మందుల ముఠాను అరెస్ట్ చేసారు. సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వరావు తెలిపిన వివరాల ప్రకారం రూ 2 లక్షల విలువగల నకిలీ మందులు స్వాధీనం చేసుకున్నారు.. ప్రజలను, రైతులను మోసం చేసేలా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అయన హెచ్చరించారు. సమాచార వనరులు అభివృద్ధి చేశాం. , ఎలాంటి అక్రమాలకు పాల్పడినా పోలీసులకు కి తెలుస్తున్నది. అక్రమ వ్యాపారాలు, కల్తీ పాదార్ధాలతో వ్యాపారం, ఇలాంటి నేరాలకు పాల్పడవద్దని అయన అన్నారు. నిందితుడు గతంలో హైదరాబాద్ లో పర్మిషన్ ఉన్న మందుల షాపులో పని చేసిన అనుభవంతో అక్రమ ధనార్జన కోసం ఈ కల్తీ మందులు తయారు చేస్తున్నారు. గడువు తీరిన మందుల డబ్బాలకు కొత్త లేబుల్స్ పెట్టి మోసానికి పాల్పడుతున్నారు. ఈదాడుల్లో కాళీ డబ్బాలు, లేబుల్స్, నకిలీ మందు స్వాధీనం చేసుకున్నారు.