పత్తి చేల కూలికై పరుగులు....
సీసా కల్లు కై బారులు...
వనపర్తి
ఇతర మండలాల కూలీలంతా ఉదయమే ఆటోలలో బిజినపల్లి మండలం లోని వివిధ గ్రామాల పత్తి చేల కూలికై పరుగులు తీస్తూ వారిచ్చే కూలీతో సీసా కల్లు కోసం సాయంత్రం కలు దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. అందులో ప్రధానంగా రేమద్దుల, రాజాపూర్, సింగేపల్లి గ్రామాలతోపాటు ఇతర గ్రామాల కూలీలంతా బిజినపల్లి మండలం లో ఉన్న పత్తి చేల కూలికై వలసలు వెళుతున్నారు. ఇలా ఒక్కొక్క గ్రామంలో 10 నుండి 20 ఆటోలలో ఒక్కొక్క ఆటోలో 20 మంది చొప్పున బిజినపల్లి మండలానికి చేరుకుంటున్నారు. పత్తి చేల యజమానులు ఒక్కొక్క కూలికి 300 రూపాయలు కూలి ఇవ్వగా అదనంగా కల్లు కోసం పది రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా కూలీలను తీసుకువెళ్లే ఆటోలకు ఒక్కొక్క ఆటోకు 1500 రూపాయలు ఇస్తున్నట్లు కూలీలు తెలిపారు. ఈ విషయంపై సత్య వార్త బ్యూరో కొంత మంది కూలీలు ప్రశ్నించగా గ్రామాలలో ప్రస్తుతం కూలి పని లభించడం లేదని, అందువల్ల 300 రూపాయల కూలి కోసం బిజినపల్లి మండలానికి వలస వెళుతున్నామని వారు తెలిపారు. ప్రస్తుతం గ్రామాలలో వరి పైర్లు ఉన్న కూలి లభించడం లేదని దీనివల్ల కుటుంబ పోషణ నిమిత్తం 300 రూపాయల కూలి కోసం పరుగులు తీస్తున్న మంటూ వారు ఆటోలలో వెళ్తున్నారు. ఇలా ఒక్కొక్క గ్రామం నుంచి 10 ,20 ఆటోలలో కూలి కోసం ఇతర మండలాలకు వలస వెళుతున్న కూడా ఏ ఒక్కరు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో రోజురోజుకు ఇతర మండలాలకు వలసలు అధికమయ్యాయి.