YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ అడంబరాలకే అప్పులు

కేసీఆర్ అడంబరాలకే అప్పులు

కేసీఆర్ అడంబరాలకే అప్పులు
యాదాద్రి భువనగిరి 
ముఖ్యమంత్రి కేసిఆర్ అల్టిమేటం జారీ చేసినా 300 మంది కార్మికులు ఉద్యోగంలో చేరలేదని,  దీన్నిబట్టి కెసీఆర్ అంటే భయపడే రోజులు లేవని, కార్మికులు,ప్రజలను చూసి  కెసీఆర్ భయపడే రోజులు  దగ్గరపడ్డాయని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం లోభువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోనియాగాంధీ పిలుపు మేరకు ఈరోజు నుండి 16 వ తేదీ వరకు మోడీ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మోడీ మాట్లాడితే మేకిన్ ఇండియా అంటారు.  కానీ దేశంలో చైనా వస్తువులే దిగుమతి అవుతున్నాయని  విమర్శించారు. రాష్ట్రం 60ఏండ్లల్లో 60 వేల కోట్ల అప్పు ఉంటే,  కేసీఆర్ ముఖ్యమంత్రి గా వచ్చాక 2 లక్షల 50 వేల కోట్లకు పెరిగిందని దుయ్యబట్టారు. ఈ అప్పులు కేసీఆర్ ఆడంబరాలకే అయ్యాయని విమర్శించారు. ఈ రోజు దేశంలో ఎక్కడా ఎన్నికలు లేకున్నా పేదల కష్టాలు తీర్చటం కోసం కాంగ్రె స్ పార్టీ ఎప్పుడు పోరాటం చేస్తున్నదని గుర్తు చేశారు.ఈ నెల 9న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా చలో ట్యాంక్ బండ్ ను విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్  అధికారంలో ఉంటే కెసీఆర్ చంచల్ గూడా జైల్లో ఉంటారని జోస్యం చెప్పారు. కెసీఆర్ అనే వ్యక్తి మనిషిరూపంలో ఉండే రాక్షసుడు. ఇంతమంది కార్మికులు చనిపోతుంటే కేసీఆర్ లో చలనం లేదని ఘాటుగా విమర్శించారు.
కసిగా పనిచేసుకుంటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి  తీసుకురావాలని కార్యకర్తలకు పిలునిచ్చారు. ఇలాంటి తెలంగాణ కోసమా నేను మంత్రిపదవి వదులుకుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.  తహసిల్దార్ విజయ రెడ్డి  హత్యపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పిసిసి పదవి ఇచ్చినా ఇవ్వకున్నా ఎన్ని జన్మలైన కాంగ్రెస్ కోసం పనిచేస్తానాని ఉద్ఘాటించారు.

Related Posts