YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఈ ఆఫీస్ గా ఇంటర్ బోర్డు

ఈ ఆఫీస్ గా ఇంటర్ బోర్డు

ఈ ఆఫీస్ గా ఇంటర్ బోర్డు
హైద్రాబాద్, 
ఇంటర్మీడియట్‌బోర్డు ప్రక్షాళన దిశగా సాగుతోంది. కీలక మార్పులతో కొత్తగా రూపుదిద్దుకుంటోంది. శుక్రవారం నుంచి ఇంటర్‌ బోర్డు పూర్తిగా పేపర్‌ లెస్‌ ఆఫీస్‌గా మారింది. వచ్చే విద్యాసంవత్సరానికి ప్రైవేటు కాలేజీలకు ఇచ్చే అఫిలియేషన్‌ను ఈ ఏడాది చివర్లోనే ఇచ్చేలా చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ రూపొందించాలని నిర్ణయించింది. ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకల వల్ల బోర్డుపై పడ్డ మచ్చను తొలగించేందుకు అధికారులు అవస్థలు పడుతున్నారు. ప్రజల్లో నమ్మకం తీసుకురావాలని భావిస్తున్నారురాష్ట్రంలో వివిధ మేనేజ్మెంట్ల పరిధిలో 2,558 జూనియర్‌ కాలేజీలుండగా, వాటిలో 10 లక్షల మంది స్టూడెంట్స్‌ చదువుతున్నారు. కాలేజీలను పర్యవేక్షించేందుకు ఇంటర్ కమిషనరేట్‌, ఇంటర్‌ బోర్డుతోపాటు వరంగల్‌ కేంద్రంగా రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫీస్‌ కొనసాగుతోంది. జిల్లాల్లో డీఐఈఓ, నోడల్‌ ఆఫీసులున్నాయి. వీటన్నింటిలో ఇప్పటి వరకూ ఆర్డర్స్‌, వర్క్‌ అంతా పేపర్‌పైనే సాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి పూర్తిగా పేపర్‌ లెస్‌ ఆఫీస్‌గా ఇంటర్ బోర్డును మార్చేశారు. అక్టోబర్‌ చివరి వారంలోనే ఇది జరగాల్సి ఉన్నా.. ఇంటర్ బోర్డుసెక్రెటరీ ఒమర్జలీల్ సంతకం డిజిటలైజ్‌లో ఆలస్యమైంది. తాజాగా ఆయన డిజిటల్‌ సంతకం అప్రూవ్‌ కావడంతో అధికారికంగా ఇంటర్‌బోర్డు ఈ–ఆఫీస్‌గా మారింది.ఇంటర్బోర్డు, కమిషనరేట్ లో మేనేజ్మెంట్లకు, స్టూడెంట్స్‌కు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు హెల్ప్లైన్ సెంటర్ ఉంది. ఫిర్యాదుల కోసం ఎలాంటి మెకానిజం లేదు. నేరుగా ఉన్నతాధికారులనే కలిసి సమస్య చెప్పుకోవాల్సి వస్తోంది. జిల్లాల నుంచి హైదరాబాద్‌ వచ్చి ఫిర్యాదు చేయడం ఖర్చుతో కూడుకున్న పని. దీంతో చాలా మంది సమస్యలను చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆన్‌లైన్‌ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీమ్ ఏర్పాటు చేయనున్నారు. వెబ్సైట్ను వారం, పదిరోజుల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రైవేటు జూనియర్‌ కాలేజీల అఫిలియేషన్‌ ప్రక్రియ ఓ సమస్యగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత, అడ్మిషన్ల ప్రక్రియ ముగిసినా అధికారికంగా కాలేజీలకు అఫిలియేషన్‌ను అధికారులు ఖరారు చేయడం లేదు. రూల్స్ ప్రకారం కాలేజీలు లేకున్నా, స్టూడెంట్ల భవిష్యత్‌ కోసం అంటూ షరతులతో అనుమతులు ఇస్తున్నారు. వీటికి చెక్‌ పెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంజనీరింగ్‌ కాలేజీల అఫిలియేషన్‌ మాదిరిగానే జూనియర్‌ కాలేజీల గుర్తింపు ప్రక్రియను నిర్వహించాలని భావిస్తున్నారు. డిసెంబర్‌లోనే అఫిలియేషన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి, మార్చి నాటికి ప్రాసెస్‌ను పూర్తి చేయాలని నిర్ణయించారు

Related Posts