దివ్యాంగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
యంఎల్ఏ.బాలనాగిరెడ్డి
మంత్రాలయం నవంబర్ 7,
నియోజకవర్గపరిధిలో ఉన్న దివ్యాంగులు అందరూ శుక్రవారం మంత్రాలయం మండల కేంద్రంలోని దుర్గా రమణ కళ్యాణ మండపంలో జరిగే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తెలియజేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని మంత్రాలయం, కోసిగి, పెద్దకడబూరు, కౌతాళం మండలాల్లోని అర్హులైన దివ్యాంగులు అయినా ప్రతి ఒక్కరూ పాల్గొని అధికారులకు దరఖాస్తులు సమర్పించాలన్నారు. దివ్యాంగులు అందరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ సంజీవ్ కుమార్, కలెక్టర్ వీరపాండియన్, ఆదోని ఆర్డీవో బాలగణేషయ్య ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారన్నారు. కార్యక్రమానికి హాజరు కానున్న దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మండల స్థాయి అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు జి. భీమిరెడ్డి, మాజీ సర్పంచ్ టి.భీమయ్య, నాయకులు జనార్దన్ రెడ్డి తదితరులు ఉన్నారు.