YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఎన్.ఐ.ఒ.ఎస్  స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల కు ఫీజు గ‌డువు10 వర‌కు పొడిగింపు

ఎన్.ఐ.ఒ.ఎస్  స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల కు ఫీజు గ‌డువు10 వర‌కు పొడిగింపు

ఎన్.ఐ.ఒ.ఎస్  స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల కు ఫీజు గ‌డువు10 వర‌కు పొడిగింపు
హైదరాబాద్, నవంబర్ 7 
నేష‌నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్.ఐ.ఒ.ఎస్.) ద్వారా డిప్లొమా ఇన్ ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్ (డి.ఎల్.ఇడి.)లో న‌మోదు చేసుకొన్న ఉపాధ్యాయుల‌కు చివ‌రి స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు 2020 జన‌వ‌రి 4వ తేదీ నుండి  జ‌న‌వ‌రి 18వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి.  ఉపాధ్యాయ అభ్య‌ర్ధులు ప‌రీక్ష రుసుమును స‌బ్జెక్టు 501 నుండి 509/510 వ‌ర‌కు ప్ర‌తి స‌బ్జెక్టు కు 250 రూపాయ‌లు చొప్పున ఆన్ లైన్ ద్వారా ఈ నెల 10వ తేదీ వ‌ర‌కు చెల్లించవచ్చని  ఎన్.ఐ.ఒ.ఎస్. ప్రాంతీయ సంచాలకులు శ్రీ అనిల్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.  2020 జ‌న‌వ‌రి 4వ తేదీ నుండి జ‌న‌వ‌రి 18వ తేదీల మధ్య నిర్వహించే చివ‌రి స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లకు  ఉపాధ్యాయ అభ్య‌ర్ధులు పరీక్ష ఫీజు ను  ఈ నెల 10వ తేదీ వ‌ర‌కు ఆన్ లైన్ ద్వారా చెల్లించడం కోసం ఎన్ఐఒఎస్  డి.ఇఎల్. ఇడి వెబ్ సైట్‌  ను సందర్శించాలని ప్రకటన లో వివరించారు. ఫీజు చెల్లించడంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే, ఎన్ఐఒఎస్ హైద‌రాబాద్ ప్రాంతీయ కేంద్రాన్ని ఫోన్‌ నంబర్ 040-24752859 లో గాని, లేదా ఫోన్ నంబర్ 040- 24750712 లో గాని సంప్ర‌దించాలని ప్రకటన లో సూచించారు.

Related Posts