YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మంచి సమయం ..

Highlights

  • తేదీ : 17 - 3- 2018, శనివారం
మంచి సమయం ..

ముఖ్యమైన పనులకు అనుకూల ముహూర్త సమయాలు

మంచి సమయం..

తె. 03.20 - 04.45 గం.ల వరకు, 
ఉ. 08.20 - 09.25 గం.ల వరకు,
మ.12.45 - 01.25 గం.ల వరకు,
మ. 03.55 - 04.45 గం.ల వరక, 
రా.  9.45 - 11.25 గం.ల వరకు.

తిథి : ఫల్గుణ బహుళ
అమావాస్య సా.6.45 వరకు

నక్షత్రం పూర్వాభాద్ర 19.45 వరకు.

శరీరం అనే లంకలో..
సుందర కాండ తెలిపేది సీతమ్మ కథనే అయినా మన జీవితానికి అతుకుతుంది. సీతమ్మ లంకలో ఉంది. లంక నూరు యోజనాల దూరంలో ఉంది. అతి లోక సుందరమైన నగరం. విశ్వకర్మ నిర్మాణం చేసాడు. అంత అందమైన నగరానికి పాలకుడు రావణాసురుడు. లోకాలని ఏడిపించే వ్యక్తి. రజో గుణనికి నిలువు రూపం. అయితే ఆయనకు ఇద్దరు సోదరులు. ఒకడు కుంభకర్ణుడు, తామసికుడు. మరొక సోదరుడు విభీషణుడు పరమ సాత్వికుడు. ఈ రావణాసురుడు పది తలలు కలవాడు. పది తలలతో ఉంటాడు. లంకానగరంలో సీతమ్మతో పాటు ఎందరో ఆడవారిని నిర్భందించాడు. వారందరూ భయానికో లేక వేరే గతి లేక రావణుడితో ఉండిపోయారు. సీతమ్మ అలా చేయలేదు, రాముడు రావాల్సి వచ్చింది. ఇది లంకానగర చరిత్ర.

ఆ సీత లోపలి ఆత్మ అని చెబుతారు. జనకుడు యజ్ఞం కోసం క్షేత్రాన్ని దున్నినప్పుడు సీత లభించింది. అట్లానే మనం శరీరం అనే క్షేత్రాన్ని సాధన చేయగా ఆత్మ అనేది లభిస్తుంది. సీత ఎట్లా అయితే పుట్టలేదో, ఈ ఆత్మకు జన్మ లేదు. ఆ లభించిన సీతను ఎవరికి అర్పించాలో తెలియక జనకుడు ధనస్సును వంపినవాడికి అర్పిస్తా అని చెపాడు. ధనస్సు రామునికి వంగింది కనుక సీతను రామునికి ఇచ్చి వివాహం చేసాడు. మనం సాధన చేయగా లభించిన ఆత్మను ఎవరికి అర్పించాలి అంటే, ధనస్సు ఓంకారానికి గుర్తు, ఓంకారం ఎవరికి వంగునో వానికే అర్పించాలి. ఓంకారం తెలిపేది పరమాత్మకు కనుక ఈ ఆత్మ పరమాత్మకు మాత్రమే చెందినది.

పరమాత్మ అందరిని ఆనందింపజేస్తాడు కనుక ఆయన రమయతి - రామ అని పేరు. రాముడిని చూసి పురుషులు కూడా మోహించేంత సౌందర్యం ఉన్న రాముడు సీతకు వశుడై ఉన్నప్పటికీ, ఆమె బంగారు లేడిని తెచ్చివ్వమని చెప్పింది. దేవుడు ప్రక్కగా ఉండగ మనం మరొకటి కోరాల్సిన అవసరం ఉండదు, అందుకే గోదాదేవి ఉన్నై అరుతిత్తు వందోం మేం నిన్ను కోరి వచ్చాం అని చెబుతుంది. ఇది మనం అడగ గలగాలి. దయ వల్ల భగవంతుడు మనం క్షుద్రమైనవి కోరినా ఇచ్చే ప్రయత్నం చేస్తాడు, కానీ మనకు హితం చెప్పే గురువులు ఉంటారు, వారు మనం ఏది కోరతగునో చెబుతుంటారు. కానీ మనం వారిని కూడా లెక్క చెయ్యం. సీతమ్మకు లక్ష్మణ స్వామి హితం చెప్పినా, ఆమె ఆయనను కూడా దూరం పంపింది. అందుకే సీతమ్మ రావణాసురుడి చెరలో పడినట్లే మనం కూడా అట్లానే శరీరం అనే లంకలో పడి ఉన్నాం. 
 

Related Posts