మతకలహాలు సృష్టించవద్దు ఎస్ ఐ నాగార్జున రెడ్డి
కోర్టు తీర్పు కు అందరూ సహకరించాలి
కౌతాళం నవంబర్ 07,:
మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో గ్రామ పెద్దలను పిలిపించి కోర్టులో ఉన్న బాబ్రీ మసీదు మరియు అయోధ్య రామ్ మందిరం కేసు గురుంచి చివరి కోర్టు తీర్పు వెలువడుతున్న సందర్భంగా అందరూ సహకరించాలని తీర్పు ను ఆహ్వానించాలని కోరారు. సభ్యులందరికి జాగ్రత్త మరియు హెచ్చరిక మీరు జాగ్రత్త పడకపోతే జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.. త్వరలో అయోధ్య రామమందిరం తీర్పు రాబోతుంది.. తీర్పు ఏవిధంగా వచ్చినప్పటికీ మీరు స్పందించ కూడదు మరియు ఆన్లైన్లో ఫేస్బుక్ ,మరియు వాట్ సాప్ లో ఏటువంటి పోస్టులు దీనికి సంబంధించి పెట్టరాదని ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించే సమాచారాలు పెట్టినప్పటికీ మీరు ఎటువంటి కామెంట్స్ కానీ , పోస్టులు గాని తిరిగి పెట్టరాదాని దీని యొక్క పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్ ఐ నాగార్జున రెడ్డి హెచ్చరించారు. మీరు ఈ సమాచారాన్ని మీకు తెలిసిన స్నేహితులు బంధువులు అందరికీ చెప్పాలని కోరారు. ఆన్లైన్ లోనే కాదు మీరు బయట కూడా ఇటువంటి ఆర్బాటాలు ఏమి చేయరాదాని గ్రామ పెద్దలను కోరారు.