సింగరేణిలో కార్మికుడి మృతి
కొత్తగూడెం నవంబర్ 06
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి 7 సాఫ్టులో ఉదయం డ్యూటీకి వెళ్లి అండర్ గ్రౌండ్ లో విధులకు హాజరై పనిచేస్తున్న భద్రు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్ప కూలి పోవడం జరిగింది అతని అండర్ గ్రౌండ్ మైన్ నుంచి పైకి1 తీసుకు రావడంతో అక్కడ సరైన ఆంబులెన్స్ లేకపోవడంతో తీవ్ర జాప్యం జరిగింది అతను భద్రుని సింగరేణి హాస్పిటల్కి తీసుకు వచ్చేలోపు మృతి చెందడం జరిగింది. సింగరేణి కార్మికుడు అయిన భద్రు గత మూడు నెలల క్రితం మెడికల్ బోర్డు కి తనకు ఆరోగ్యం బాలేదని అప్లై చేసుకోగా సింగరేణి యాజమాన్యం నువ్వు పని చేస్తావు వెళ్ళు అని చెప్పడంతో ఈరోజు విధులు నిర్వహిస్తూ భద్రు ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో మరణించాడు దీనికంతా కారణం సింగరేణి మొండివైఖరి అని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు సరైన సమయంలో ఆంబులెన్స్, మెడికల్ బోర్డు,, అక్రమాల వల్ల ఒక నిండు ప్రాణం బలి తీసుకుందని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు .