YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం తెలంగాణ

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి  నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి  నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
 నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్
నాగర్ కర్నూలు   నవంబర్ 7 
జిల్లాలో ప్రధానం కూడళ్ల వద్ద ఎక్కడ చూసినా పొగరాయుళ్లు దర్జగా సిగరెట్లు కాలుస్తూ కనిపిస్తుంటారని, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.  పొగాకు ఉత్పత్తులో నికోటిన్ అనే విషతులమైన పదార్థం ఉంటుందని, పొగతాగేవారిగురించేకాకుండా వారి పరిసరాలను దృష్టిలో పెటుకుని కేంద్ర ప్రభుత్వం సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ (సివొటిపి) చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం నేరం.. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని అడ్డుకోవడానికి యాంటి టొబాకో సెల్ జిల్లా ఉన్నతస్థాయి కమిటీ మొదటి సమావేశం జిల్లా కలెక్టర్ ఈ శ్రీధర్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు.  జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ...  బహిరంగ ప్రదేశాల్లో పాఠశాలల, కళాశాలల ఆవరణలో పొగతాగే వారిపై చర్యలు తీసుకునేందుకు కమిటీ సభ్యులను ఆదేశించారు. సిగరెట్, బీడీ ఇతర టొబాకో ఉత్పత్తుల్లో ఉండే 'నికోటిన్' విషతుల్యమైన పదార్థాలు. ఇవి సేవించేవారి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుందని, ధూమపానానికి ఒకసారి అలవాటుపడితే దానికి బానిసగా మారుతారని, ఈ ధూమాపానం మనిషిని క్రమంగా చంపుతుందన్నారు. ఇంతటి అత్యంత ప్రమాదాకరమైన ధూమాపానాన్ని యువత స్టేటస్గా తీసుకుంటూ అనారోగ్యానికి బానిసలు కాడ కాకుండా చూడాలన్నారు.    మద్యం, గుట్కా, డ్రగ్స్ వంటి ఇతర మత్తు పదార్థాలకు అలవాటుపడినవారు వారి అరోగ్యాలనుమాత్రమే నాశనం చేస్తుందని, కానీ ధూమాపానం మాత్రం పొగరాయుళ్లతో పాటు బహిరంగ ప్రదేశాల్లో ఆ పొగను పీల్చే వారి అరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుండడం అత్యంత ఆందోళనకరమైన విషయంగా మనమందరం భావించి, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమాపానం నిషేద చట్టం ప్రకారం చర్యలకు పూనుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రాడక్ట్స్ (సివోటిపి) చట్టం: సిగరెట్ అండ్ అదర్ టొబాకోప్రోడక్ట్స్ (సివోటిపి)2003లో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. 2008లో అమల్లోకి తీసుకొచ్చిందని, ఈ చట్టాన్ని క్షేత్ర ప్రాంతాల్లో అమలు చేయాల్సిన పోలీసు, వైద్యశాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్, బీడీ, చుట్ట వంటి వాటితో  హోటళ్లు, రెస్టారెంట్లు,బార్లు, పార్కులు, సినిమాహాళ్లు, బస్టాండ్, టి షాపులు, నాలుగు రోడ్ల కూడళ్లు నిషేధిత ప్రాంతాలుగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.   పొగరాయుళ్లతో వారి అరోగ్యమే కాకుండా పక్కనున్న ఇతరుల ఆరోగ్యానికి హాని కలగకుండా ప్రజలను చైతన్య పరచాలని సూచించారు.  క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులకు 30 నుంచి 40 శాతం ధూమాపానంతో పాటు ఇతర పొగాకు ఉత్పత్తులకు సేవించడమే కారణమని వైద్యనివేదికల చెబుతున్నాయ్ అన్నారు. ముఖ్యంగా బహిరంగా ప్రదేశాల్లో పొగతాగడం చట్ట ప్రకారం నిషేధ   చట్టం అమలు అమలులో ఉందని ప్రతి ఒక్కరికి తెలిసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా ధూమాపానంతో ఇబ్బందులు సృష్టిస్తున్న పొగరాయు ళ్లపట్ల అటు పోలీసులు, ఇటు వైద్య ఆరోగ్యశాఖ కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
సంబంధిత శాఖల అధికారులతో యాంటి టొబాకో సెల్  ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమాపానాన్ని అడ్డుకోవాడానికి యాంటీ టొబాకో సెల్ ఉన్నత స్థాయి కమిటీ పనిచేయాలని,  ఉన్నత స్థాయి కమిటీ, బహిరంగ ప్రదేశాల్లో పొగతాగేవారిపై కేసులు నమోదు చేసే అధికారం పోలీసులకు ఉందని, జిల్లాలో 22 పోలీస్ స్టేషన్ లకు ఫైన్ రిసిప్ట్ లను పంపించాలని వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించారు. ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా పొగతాగుతున్న వారికి పోలీసులు ఇప్పటినుండి కేసులను నమోదు చేయాలని, సిగరెట్లోని 'నికోటిన్' గాలిలోని నైట్రోజన్తో కలిసి కార్షినోజన్లుగా మారుతుందన్నారు. దీంతో దీర్ఘకాలంలో క్యాన్సర్ కు గురవుతున్నారని తెలిపారు.

Related Posts