రైతులు ఆందోళన చెందవద్దు..బాధిత రైతులను ఆదుకుంటాం: మంత్రి వేముల
నిజామాబాద్ నవంబర్ 7
జిల్లాలో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులు ఆందోళన చెందొద్దని.. బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా ముక్కల్ మండలం నల్లూరు గ్రామ శివారులో వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. జిల్లాల్లో ఇప్పటివరకు 22 వేల ఎకరాల్లో వరి పంటకు తాత్కాలికంగా నష్టంవాటిల్లినట్లు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో తీసుకునేందుకు ఆదేశాలు జారీచేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పంట బీమా ద్వారా బాధిత రైతులకు సహాయం అందేవిధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.ఎం.రావు, డీఎం సివిల్ సైప్లె అభిషేక్ సింగ్, జేడీఏ గోవింద్, ఏడీ మార్కెటింగ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.