YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

గుంటూరు దుర్ఘటన అధికారుల వైఫల్యమే.

Highlights

మునిపల్ అధికారులపై అగ్రహం

టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు

గుంటూరు దుర్ఘటన అధికారుల వైఫల్యమే.

గుంటూరు దుర్ఘటన శాఖాపర వైఫల్యం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శనివారం మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... ఒక వ్యక్తి వైఫల్యం 10మంది మృతికి కారణం కావడం దురదృష్టకరమన్నారు. విపత్తు వస్తే దానిని చక్కదిద్దేవరకు వదిలిపెట్టకూడదన్నారు. ‘విశాఖలో హుద్‌హుద్ అప్పుడు ఎలా చేశాం..? గుంటూరులో ఆ స్ఫూర్తి ఏమైంది..? అంటూ అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా వైఫల్యం చెందితే ఉన్నతస్థాయి యంత్రాంగం చక్కదిద్దాలని, అధికార యంత్రాంగం పనితీరు ప్రభుత్వం గౌరవం పెంచేలా ఉండాలన్నారు తప్పు జరగకూడదు.., ఒకవేళ జరిగితే సకాలంలో సరిదిద్దాలన్నారు. ఉదాసీనత, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, రోడ్లు తవ్వడం, గుంతలు వదిలేయడంతో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. నివాసలక్రింద వున్న పైపులైన్ల తొలగించి నూతనంగా పైపులైన్ల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు పైపులైన్ల లీకేజీలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, మురుగు కాలువలన్నీ శుభ్రపరచాలన్నారు.

Related Posts