సిటీలో మరో కలికితురాయి...
హైద్రాబాద్,
విశ్వనగర శిగలో మరో కలికితురాయిగా భారీ పథకం రానున్నది. నగరవాసుల ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు మూసీనది వెంట ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌ను నిర్మించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేస్తున్నది. మొత్తం దాదాపు 52 కి.మీ.లుగా సుమారు రూ. 4 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మూసీనది వెంట ఈ వంతెనను తీసుకురావాలని భావిస్తున్నది. ఈ మేరకు ఇటీవల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది.రాష్ట్రపురపాలక శాఖ మంత్రి కెటి రామారావు సూచనల మేరకు మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్(ఎంఆర్‌డిసి), హెచ్‌ఎండిఎ, జిహెచ్‌ఎంసి, పిసిబి అధికారులతో ఈ చర్చ జరిగినట్టు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీ, నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు నగరంలోని తూర్పు, పడమరలను కలిపే విధంగా ప్రత్యేక వంతెనను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని పురపాలక విభాగపు అధికారులు పేర్కొంటున్నారు.మూసీనది నగర శివారు పశ్చిమ ప్రాంతంలో హిమాయత్‌సాగర్ నుంచి ప్రారంభమై నగర తూర్పుదిశలోని గౌరెల్లి వద్ద నగరాన్ని దాటుతుంది. శివారు ప్రాంతంలో మూసీనది ప్రవహించే దూరం సుమారు 52 కి.మీ.లుగా ఉండి నగరాన్ని