అక్రమ ఉల్లిని సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు
విజయవాడ నవంబర్ 8,
విజయవాడలో విజిలెన్స్ అండ్ ఎన్ పోర్స్ మెంట్ అధికారులు ఉల్లి హోల్ సేల్ వ్యాపారసంస్ధలలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఉల్లిరేటు రోజు రోజుకు పెరుగుతున్న నేపద్యంలో వ్యాపారుల అక్రమనిల్వలు చేయకుండా విజిలెన్స్ ఎస్పీ వెంకటరెడ్డి గారి నేత్రుత్వంలో విజిలెన్స్ సిఐ సాహేర, అసిస్టెంట్ జుయాలజిస్టు బాలజీనాయక్ లు బి.ఆర్.టి.ఎస్. రోడ్డులోని ఉల్లి హోల్ సేల్ వ్యాపారసంస్ధలోనూ, మహాత్మహాందీ హోల్ సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఉల్లి వ్యాపారసంస్ధలలో సోదాలు చేసారు. మహాత్మగాంధీ హోల్సేల్ కయర్షియల్ కాంప్లెక్స్లో అక్రమంగా ఉల్లిని నిల్వచేసిన 100వ షాపు నెంబరుకు ఎలాంటి లైసెన్సు లేకపోవడంతో అధికారులు షాపును సీజ్ చేశారు. సీజ్ చేసిన స్టాక్ మార్కెట్ యార్డు సెక్రటరీకి అప్పగించారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు స్పష్టం చేశారు.