అకాల వర్షంతో రైతు ఆగమాగం
ఖమ్మం నవంబర్ 8,
చేతికి అందాల్సిన పంటను కోసి సమయం. ధాన్యాన్ని పత్తిని మార్కెట్కు తరలించే సమయం. కానీ అకాల వర్షం రైతు ఆశల్ని నీరు గార్చింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం రైతును కన్నీళ్ల పర్యంతం చేసింది. కూలీలు దొరక్క పత్తి పొలంలోనే పత్తి ఉండిపోయింది ధాన్యం కుడా పొలంలోని కోతకు ఎదురుచూస్తోంది. ఈ వర్షం ఆ రెండు పంటలపై ప్రభావం చూపింది. పొలంలోనే పంటను పాడు చేసింది దీంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి అందక రైతులు లబో దిబో మన్నారు. కోసిన ధాన్యం ఆర పెట్టుకుంటే అది కాస్త తడిసి ముద్ద వడం రైతును పరిచింది. వర్షాభావ పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో పంట సాగుబడి రైతుకు కష్టతరమైనది. కానీ అప్పుడు పడాల్సిన వాన ఇప్పుడు పడి పంట నాశనానికి దారితీసింది. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఖమ్మం జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొన్నది.