చిన్నారి దారుణ హత్య
చిత్తూరు నవంబర్ 8,
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్ళ వద్ద దారుణం జరిగింది. స్థానిక ఏవీఎన్ ఫంక్షన్ హాల్ వద్ద వర్షిణి అనే చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసారు. గురువారం రాత్రి బందువులు పెళ్లికి వర్షిణి తల్లిదండ్రులు వెళ్లారు. రాత్రి 12 గంటల తరువాత చిన్నారి వర్షిణి కనబడకుండా పోయింది. దాంతో ఆదే రాత్రి కురబలకోట పోలీసులకు ఫిర్యాదు చేసారు. శుక్రవారం ఉదయం ఫంక్షన్ హాలు పక్కనే చిన్నారి మృతదేహాన్ని కనుగోన్నారు. చిన్నారి ది బి.కొత్త కోట మండలం గుట్టపాలెం. సి.ఐ అశోక్ కుమార్, ఎస్సై సుకుమార్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.