YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రివర్స్ వేలం టెండర్ అమలుపై అధికారులకు  అవగాహనా సదస్సు

రివర్స్ వేలం టెండర్ అమలుపై అధికారులకు  అవగాహనా సదస్సు

రివర్స్ వేలం టెండర్ అమలుపై అధికారులకు  అవగాహనా సదస్సు
కర్నూలు,
ఇ-టెండర్ ప్రోక్యుర్మేంట్ (రివర్స్ టెండర్) పై సంపూర్ణ అవగాహనా పొంది అన్ని శాఖలు అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్-2 సయాద్ ఖజామోహిద్దిన్ జిల్లా అధికారులను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియం నందు ఆంధ్ర ప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఉపాది టెక్నో సర్వీసెస్ వారిచే రివర్స్ వేలం టెండర్ అమలుపై జిల్లా అధికారుల ఒక్కరోజు అవగాహనా సదస్సులో అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్-2 సయాద్ ఖజామోహిద్దిన్ మాట్లాడుతూ రివర్స్ టెండరింగ్ విధానంపై ప్రభుత్వం జిఓ నెం:67 విడుదల చేసిందని ఈ మేరకు ఇంజనీరింగ్ శాఖలు, ఇతర సివిల్ ఇంజనీరింగ్ పనులు రివర్స్ టెండర్ విధానంలో వెళ్లేందుకు సంపూర్ణ అవగాహనా పొందాలన్నారు. రూ.10 లక్షల పైన మంజూరు చేసిన పనులకు సంబంధించి రివర్స్ టెండర్ కు వెళ్ళాలని అయన సూచించారు. రివర్స్ టెండర్ విధానంపై అర్థం చేస్కునేందుకు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఆంధ్ర ప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఉపాది టెక్నో సర్వీసెస్ వారిచే ఒక్కరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ శిక్షణలో సందేహాలన్నీ నివృత్తి చేసుకొని క్రియాశీలక అనుభవాన్ని పొందాలన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ లో దాదాపు రూ.700 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం సమకురిందన్నారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఇ-ప్రోక్యుర్మేంట్ ద్వారా అమలు చేస్తే భవిష్యత్తులో వివాదాలు, సమస్యలు, ఘర్షణ వాతావరణాన్ని నిరోధించవచ్చన్నారు. సాదారణ బాక్స్ టెండరింగ్ విధానానికి స్వస్తి పలికి ఇ-ప్రోక్యుర్మేంట్ టెండరింగ్ విధానానికి అలవాటు పడాలన్నారు. ఉపాది టెక్నో సర్వీసెస్ ఫంక్షన్ సమన్వయకర్త జే.వెంకటేష్ ఇ-ప్రోక్యుర్మేంట్ టెండరింగ్ విధానంపై పరిపూర్ణ శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఈ జయరామి రెడ్డి, పంచాయతి రాజ్ ఎస్ఈ సుబ్బా రెడ్డి, ఆర్ డబ్ల్యుఎస్ ఎస్ఈ మల్లికార్జున, హౌసింగ్ పిడి తదితర అన్ని శాఖల అధికారులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts