Highlights
- ఏసీబీ వలలో న్యాయమూర్తి
- లేబర్ కోర్ట్ జడ్జి ఎం.గాంధీపై కేసు
- నమోదు చేసిన ఏసీబీ.
ఆదాయానికి మించి అక్రమంగా కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారనే అభియోగంతో వారాసిగూడ లోని న్యాయమూర్తి గాంధీ ఇంట్లో ఏసీబీ సోదాలు. హైకోర్టు అనుమతితో జడ్జి అక్రమ ఆస్తులపై శనివారం దాడులు జరిపారు. వారాసిగుడలోని అతని ఇంటితో పాటు..నాంపల్లి, డీడీ కాలనీ, ఆంధ్ర ప్రదేశ్ లోని కొవ్వూరు లో రెండు చోట్ల, ఏలూరు, రాజమండ్రి తో సహా మొత్తం 7 చోట్ల ఏకకాలంలో ఏసీబీ దాడులు చేపట్టింది. ప్రస్తుతం గాంధీ. జిల్లా జడ్జి క్యాడర్ లో ఉన్నారు. ఏసీబీ అధికారులు న్యాయమూర్తి గాంధీని అదుపులోకి తీసుకుని విచారుస్తున్నారు.