YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఛలో ట్యాంక్ బండ్…సీనీకి కలిసిన అఖిల పక్ష నేతలు

ఛలో ట్యాంక్ బండ్…సీనీకి కలిసిన అఖిల పక్ష నేతలు

ఛలో ట్యాంక్ బండ్…సీనీకి కలిసిన అఖిల పక్ష నేతలు
హైదరాబాద్ 
శనివారం ఆర్టీసీ ఐకాస తలపెట్టిన ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి అనుమతి కోసం నగర పోలీసు కమిషనర్ కు అఖిలపక్ష నేతలు శుక్రవారం కలిసారు. తరువాత మీడియాతో మాట్లాడారు.  శనివారం మధ్యాహ్నం 1 నుండి 4 గంటల వరకు ఆర్టీసీ జెఏసి ఇచ్చిన పిలుపు మేరకు చలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో పాల్గొంటున్నామని  టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రజా రవాణాకు ఎలాంటి ఇబ్బంది కలుగదు. శాంతియుతంగా నిర్వహిస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలు జరపాలను రాష్ట్ర ప్రభుత్వానికి సూసించిందని అన్నారు. శనివారం కార్యక్రమానికి మాకు అనుమతి ఇవ్వాలి. కార్మికులను చర్చలకు పిలవాలి. ఈ  కార్యక్రమానికి అందరూ కలిసి విజయవంతం చేయాలి. ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల ఆవేదనను అర్థం చేసుకుంటుంది అని అనుకుంటున్నానని అయన అన్నారు. సీపీఐ నేత చాడా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ  చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి  అనుమతి అడిగాం. కానీ ఇప్పటి నుండే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. శనివారం  మధ్యాహ్నం 1 నుండి 4 వరకు సామూహిక నిరసన దీక్షలు చేస్తామని అన్నారు. టీటీడీపీ నేత ఎల్ రమణ మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె విషయంపై అఖిల పక్షాన్ని పిలవకపోవడం చాలా బాధాకరవిషయమని అన్నారు. సకల జనుల సామూహిక దీక్షలో రేపు ట్యాంక్ బండ్ పై కూర్చోవలని నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి టిడిపి నేతలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ చట్టాన్ని కాదని ఆర్టీసీని ఎలా ప్రైవేటీకరణ   ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ పై హై కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఇప్పటికైనా కేసీఆర్ మంచి మనసుతో ఆలోచించి చర్చలకు పిలవాలి. చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి ఇంత వరకు అనుమతి ఇవ్వలేదు.  మధ్యాహ్నం 1 నుండి 4 గంటల వరకు ట్యాంక్ బండ్ పై జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు

Related Posts