ఘనంగా ఎంపీ రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.
కొడంగల్
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే,మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి 51వ జన్మదిన వేడుకలను,కొడంగల్ లోని ఆయన నివాసం లో,ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరిపారు.ఈ సందర్బంగా వారు ముందుగా కూడలి లోని అంబేద్కర్ విగ్రహం కు పూల మాల వేశారు. అనంతరం వారు మాట్లాడుతు నిరంతరం ప్రజా శ్రేయస్సే ద్యేయంగా, వారి వెన్నంటి ఉంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గడుతూ,దేశ వ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించు కున్న మహోన్నత వ్యక్తి రేవంత్ రెడ్డి అని తమ అభిమానాన్ని తెలిపారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కు పెన్నులు నోట్ పుస్తకాలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణం రాజు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.