YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

విద్యార్దుల నిరసన మిర్యాలగూడ

విద్యార్దుల నిరసన మిర్యాలగూడ

విద్యార్దుల నిరసన
మిర్యాలగూడ నవంబర్ 8, 
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ల విద్యార్థులకు రావలసిన 8 నెలల మెస్ బిల్లులు వెంటనే చెల్లించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్దిని విద్యార్దులు పట్టణంలో ప్రధాన రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు.  ప్రభుత్వం వెంటనే మెస్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట 48గంటల రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు.దీక్షలో సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొని విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ నిరుపేద విద్యార్దిని విద్యార్దులు నెలవారీ మెస్ బిల్లులు చెల్లించ లేని స్థితిలో ఎలా ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందన్నారు. విద్యార్థులకు కనీస వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related Posts