కాంగ్రెస్ భారీ ర్యాలీ…ఉద్రిక్తత
సూర్యాపేట నవంబర్ 8,
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. పట్టణం నుండి భారీగా కదిలిన కాంగ్రెస్ శ్రేణులు కదం తోక్కాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడీలో భాగంగా కాంగ్రేస్ పార్టీ మాజీమంత్రి రాం రెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో , రాష్ట్రంలో అవినీతి , అక్రమాలు పెరిగాయన్నారు . ప్రజల ఆర్ధిక పరిస్థితి చిన్నాభిన్నమయ్యాయన్నారు . అటు దేశంలో , ఇటు రాష్ట్రంలో పాలకులు అవలంబిస్తున్న ఆర్ధిక విధానాల వలన సామాన్య ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు . దేశ ప్రజల జీవనాన్ని మెరుగు పర్చే విధానాలు చేపట్టకపోగా , తప్పుడు ఆర్ధిక విధానాల వలన ప్రజలపై భారం మోపుతున్నారన్నారు . ఒక వైపు దేశ , రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అత్యంత మందగమనంలో ఉందన్నారు . ఇక రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యమంత్రి అవలంబిస్తున్న అనాలోచిత ఆర్ధిక విధానాలు ఒక వైపు , ఆర్టీసి కార్మీకులు గత 34 రోజులుగా సమ్మె చేస్తున్నా కూడా వారి పట్ల సానుకూలంగా వ్యవహరించకుండా, ఆర్టీసి నష్టాలకు పరోక్షంగా కారకుడయ్యారన్నారు . ఇక నైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ప్రజల జీవన విధానాలు మెరుగుపడే విధంగా పాలన సాగించాలన్నారు. అనతరం డీఆర్వో కు వినతిపత్రం సమర్పించారు.