సీపీఐ కార్యవర్గ భేటీ
వనపర్తి నవంబర్ 8
వనపర్తి పట్టణం శ్వేతా నగర్ లోని సిపిఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఇటీవల మృతిచెందిన సిపిఐ జాతీయ నాయకులు పార్లమెంటు మాజీ సభ్యులు కామ్రేడ్స్ గురుదాస్ గుప్తా విశాలాంధ్ర దినపత్రిక మాజీ సంపాదకులు రాఘవాచారి లకు ఐదు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు .అనంతరం జిల్లా కార్యవర్గ సమావేశనికి జిల్లా కార్యవర్గ సభ్యులు జె చంద్రయ్య అధ్యక్షత వహించారు .ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కె విజయ రాములు సీనియర్ నాయకులు డి చంద్రయ్య తదితరులు మాట్లాడారు .గురుదాస్ గుప్తా రాజ్యసభ లోక్ సభ లో సభ్యులుగా పార్టీ జాతీయ నాయకులుగా తమ జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని అలాగే విశాలాంధ్ర దినపత్రిక సంపాదకులుగా 33 ఏళ్లు ఆయన సేవలు అపూర్వ మని కొనియాడారు .వారు లేని లోటు తీర్చలేదని అన్నారు. వారు చూపిన మార్గంలో నడవడమే నిజమైన నివాళి అన్నారు. అనంతరం జిల్లాలో పార్టీ నిర్మాణం గురించిన చర్చ ప్రారంభించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు అబ్రహం రాబర్ట్ మాట్లాడారు ఈ సందర్భంగా పలుమార్లు పోలీసులు ఆఫీసులోకి వచ్చి స్టేషన్ కి రావలసిందిగా ఒత్తిడి చేశారని కార్యవర్గం అనంతరం వస్తావని నచ్చజెప్పినా వినలేదని దీంతో సమావేశం పూర్తికాకుండానే నాయకులను బలవంతంగా టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారని అన్నారు. సంతాప కార్యక్రమం లో జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామచంద్రుడు రమేష్ మోష జె చంద్రయ్య భాస్కర్ ర్ మశప్ప శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.