తాహసీల్దారు ను చంపడం అమానుషం
ఆర్డీఓ డాక్టర్ గంట నరేందర్
ఐదవరోజు విధుల బహిష్కరణ
జగిత్యాల నవంబర్ 8(న్యూస్ పల్స్)
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తాహసీల్దార్ విజయ రెడ్డి సజీవదహనం హత్యాకాండను నిరసిస్తూ జగిత్యాల జిల్లాలో ఐదవ రోజు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో వీఆర్ఏ నుంచి తహసీల్దార్ ల వరకు నల్లబ్యాడ్జీలు ధరించి 18 మండలాల తాహసీల్దార్ కార్యాలయ ల ,ఆర్డీవో కార్యాలయల ఎదుట ఆందోళన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఆవరణలో వీఆర్ఏ నుంచి తాహసీల్దార్ ల వరకు రెవెన్యూ ఉద్యోగులు విజయ రెడ్డి, ఆమె ప్రాణాలు కాపాడడం కోసం అసువులు బాసిన డ్రైవర్ గురునాథంల ఆత్మశాంతికి నివాళులు అర్పించారు అనంతరం జరిగిన ఆందోళన ప్రదర్శనలో ఆర్ డి ఓ డాక్టర్ గంట నరేందర్ మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు అధికారులు రాత్రింబవళ్లు పండగనక పబ్బం అనక భూప్రక్షాళనలో అంకితభావంతో పని చేయడం వల్లే రెండు లక్షల పద్నాలుగు వేల మంది రైతులకు పాసుబుక్కులు అందజేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాల విజయవంతానికి ప్రజలకు సేవలందించడంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో కీలక శాఖగా వివరిస్తున్న రెవెన్యూ శాఖ పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నవారిపై బెదిరింపులకు గురి చేస్తున్న వారిపై చట్టపర చర్యలు ఉంటాయన్నారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భోగ శశిధర్ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో రెవెన్యూ ఉద్యోగుల పై అనుచిత తప్పుడు పోస్టులు పెడుతున్న వారు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. టీ రెవెన్యూ ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ హత్యకు గురైన తాహసీల్దార్ విజయ రెడ్డి ప్రాణాలు రక్షించడానికి చేసిన ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్ గురునాథం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని వారి కుటుంబంలో అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. టి రెవెన్యూ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు ఎండి వకిల్
మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులకు అన్ని తాహసీల్దార్ కార్యాలయాల్లో పోలీసులతో భద్రత కల్పించాలని హంతకుడి వెనుక ఉన్న వ్యక్తులపై హత్యానేరం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి రెవెన్యూ గౌరవ అధ్యక్షులు హరి కుమార్, రెవెన్యూ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండి వకీల్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భోగ శశిధర్, ఆర్ డిఓ కార్యాలయ ఏవో దిలీప్ నాయక్, తాహసీల్దార్ లు నవీన్, శ్రీనివాస్, రెవెన్యూ నాయకులు చేలుకల కృష్ణ, రాజేందర్ రావు, రాజేంద్ర ప్రసాద్, విట్టల్ రావు, రాజు, ఎండి ఖాదర్, ముద్దం రవి, మహమూద్, వేణుగోపాల్, చంద్రిక, శ్రీలత రాజేశ్వరి, పద్మావతి ,విఆర్ ఎ ల నుంచి తాహసీల్దార్ ల వరకు ఉన్న రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.