YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వంశీ  యూ టర్న్ తీసుకున్నారా...

వంశీ  యూ టర్న్ తీసుకున్నారా...

వంశీ  యూ టర్న్ తీసుకున్నారా...
విజయవాడ,
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా ఎక్కడుంది? వల్లభనేని వంశీ తన రాజీనామా లేఖను చంద్రబాబుకు మాీత్రమే పంపారు. ఇటు పార్టీకి అటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ వాట్సప్ లో తన లేఖలను వల్లభనేని వంశీ పంపారు. అయితే ఇప్పటి వరకూ చంద్రబాబు ఆ రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపలేదు. పార్టీకి వల్లభనేని వంశీ చేసిన రాజీనామాను సయితం చంద్రబాబు ఆమోదించలేదు.వల్లభనేని వంశీ రాజీనామా హైడ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో ఉండరన్నది మాత్రం తేలిపోయింది. ఆయన వద్దకు ఎంపీ కేశినేని నానిని రాయబారానికి పంపినా వెనక్కు తగ్గలేదు. తాను పార్టీలో కొనసాగేది లేదని తెగేసి చెప్పడంతో వల్లభనేని వంశీ వ్యవహారాన్ని చంద్రబాబునాయుడు ప్రతి పార్టీ సమావేశాల్లో ప్రస్తావిస్తూనే ఉన్నారు. వల్లభనేని వంశీపై అక్రమ కేసులు పెట్టి వేధించడం వల్లనే ఆయన పార్టీకి రాజీనామా చేశారని చెబుతున్నారు.తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన నియోజకవర్గ సమీక్షలో సయితం వల్లభనేని వంశీ వ్యవహారమే చంద్రబాబు హైలెట్ చేశారు. అయితే ఇంతకీ వల్లభనేని వంశీ పార్టీని వీడుతున్నట్లు చెప్పారు కాని ఇంతవరకూ రాజీనామా లేఖను స్పీకర్ కు పంపలేదు. దీంతో ఆయన వల్లభనేని వంశీని రూల్స్ కమిటీలో సభ్యుడిగా నియమించారు. అసలు వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? లేదా? అన్నది కూడా అనుమానంగానే ఉంది.కేవలం ప్రభుత్వాన్ని బెదిరించడానికే వల్లభనేని వంశీ రాజీనామా చేశారా? బెదిరింపులే అయిత ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ను ఎందుకు కలిసినట్లు? ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన వల్లభనేని వంశీ పత్తా లేకుండా పోయారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినా ఆయన వైసీపీలో చేరడంపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. అలాగే వైసీపీ నుంచి కూడా స్పష్టమైన సంకేతాలు లేకపోవడంతో వల్లభనేని వంశీ ఎమ్మల్యే పదవికి రాజీనామా చేయడానికి వెనక్కు తగ్గినట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన టీడీపీకి రాజీనామా చేసి స్వతంత్ర సభ్యుడిగా కొనసాగాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Posts