Highlights
- చెల్లుకు చెల్లు..
- వోట్లు వేసి నన్ను సంతోష పెట్టారు.
- బంగారు తెలంగాణ చెప్పి మిమ్మల్ని సంతోష పెట్టా
- ఇంకేందిరా భై చేసేది.
- అసెంబ్లీలో ఓవైసీ వినిపించిన పిట్టకథ
అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఉద్దేశించి ఏఐఎంఐఎం నాయకుడు అక్బరుద్దిన్ ఓవైసీఓ పిట్టకథ వినిపించారు.
ఒక సింగర్ నవాబ్ దగ్గర పాటలు పాడాడు..
నవాబ్ : వాహ్వ ! వీనికి ముత్యాలు ఇవ్వండి.
సింగర్ ఇంకా పాడాడు.
నవాబ్ : వీనికి మణులు మాణిక్యాలు ఇవ్వండి
సింగర్ ఇంకా పాడాడు.
నవాబ్ : వీనికి వజ్ర వైడుర్యాలు ఇవ్వండి.
సింగర్ ఇంకా పాడాడు.
నవాబ్ : వీనికి భూములు నజరానాగా ఇవ్వండి.
సింగర్ చాల సంతోష పడ్డాడు.
ఇంటికి వెళ్లి పెళ్ళాం బిడ్డలకు చెప్పుకున్నాడు. వాళ్ళు కూడా చాల సంతోష పడ్డారు.
ఎన్ని రోజులైనా నవాబ్ గారు అవి పంపించలేదు.
ఆ సింగర్ చూసి చూసి నవాబ్ దగ్గరకు వెళ్లి " అయ్యా! మీరు ఇస్తామన్న ముత్యాలు, మణులు మాణిక్యాలు, భూములు వగైరా నాకు ఇంతవరకు ఇవ్వలేదు.
దానికి నవాబ్ : ఇందులో ఇచ్చి పుచ్చుకొనుడు ఏముంది. నువ్వు మా చెవులకు ఇంపుగా పాడినావ్. నేను నీ చెవులకు ఇంపుగా చెప్పినాను . చెల్లుకు చెల్లు. ఇంకా ఇచ్చేడిది ఏందీ.?
ఇట్లాగే కెసిఆర్ కూడా మీరు వోట్లు వేసి నన్ను సంతోష పెట్టారు.
అలానే మీకు బంగారు తెలంగాణా అని చెప్పి మిమ్మల్ని సంతోష పెట్టాను. చెల్లుకు చెల్లు. ఇంకేందిరా భై చేసేది.