YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తప్పటడుగుల అల్పేశ్ ఠాకూర్

తప్పటడుగుల అల్పేశ్ ఠాకూర్

తప్పటడుగుల అల్పేశ్ ఠాకూర్
గాంధీనగర్, 
అల్పేశ్ ఠాకూర్ యువనేత. ఓబీసీ వర్గాల నుంచి లీడర్ గా ఎదిగారు. ఆయన వేసిన రాజకీయ తప్పటడుగులు పొలిటికల్ గా రాంగ్ అయ్యాయని చెప్పక తప్పదు. అధికారం వైపు చూస్తే ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరన్నది అల్వేశ్ ఠాకూర్ విషయంలో రుజువయింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలపించిన నియోజకవర్గం ప్రజలే చివరకు పార్టీ మారడంతో అల్ఫేశ్ ను ఓడించడం చూస్తే నాయకుడు ఎలా ఉండాలో ప్రజలు చెప్పకనే చెప్పారన్నది స్పష్టమవుతోంది.అల్ఫేశ్ ఠాకూర్ ఓబీసీ ఉద్యమ నాయకుడు. పాటీదార్ల రిజర్వేషన్ల కోసం ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతుండగా అల్ఫేశ్ ఠాకూర్ ఓబీసీలకు నాయకుడిగా అవతరించారు. అల్ఫేశ్ ఠాకూర్ గుజరాత్ క్షత్రియ ఠాకూర్ సేనను కూడా స్థాపించారు. ఓబీసీ సమస్యలపై ఆయన ఉద్యమించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఆయన ఓబీసీల నాయకుడిగా ఎదిగిపోయారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అల్ఫేశ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తానని ఆయన మీద నమ్మకంతోనే పార్టీలో చేరానని అల్ఫేశ్ ఠాకూర్ చెప్పారు.కాంగ్రెస్ అభ్యర్థిగా 2017లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రథన్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే గుజరాత్ లో కాంగ్రెస్ అధికారంలో రాకపోవడం, కేంద్రంలో కూడా మళ్లీ మోడీ రావడంతో అల్ఫేశ్ ఠాకూర్ అధికారం వైపు పరుగులు తీశారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ క్రాస్ ఓటింగ్ చేసి వార్తల్లోకి ఎక్కారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బీజేపీకి రాజ్యసభ ఎన్నికల్లో సహకారం అందించిన అల్ఫేశ్ ఠాకూర్ తర్వాత ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.తర్వాత అల్ఫేశ్ ఠాకూర్ బీజేపీలో చేరిపోయారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రథన్ పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. గెలుపు ఖాయమన్న ధీమాలో ఉన్నారు. గుజరాత్ లో బీజేపీకి పట్టు ఉండటం, కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడంతో ఆయన గెలుపు గ్యారంటీ అనుకున్నారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో 3807 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఓబీసీ నాయకుడిగా ఎదిగిన అల్ఫేశ్ ఠాకూర్ ను ప్రజలు పార్టీ మారడంతో తిప్పికొట్టారు. అల్ఫేశ్ ఠాకూర్ రాజకీయ తప్పటడుగులు మిగిలిని యువనేతలకు ఒక గుణపాఠంగా చెప్పుకోవాలి

Related Posts