మన్యం భూములపై కార్పొరేట్ పడగ..
ఖమ్మం,
భద్రాచలం ఏజెన్సీలోని వ్యవసాయం కార్పొరేట్‍ఉచ్చుకు చిక్కింది. ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ప్రముఖ కంపెనీ
మన్యం భూములపై కార్పొరేట్ పడగ..
ఖమ్మం, నవంబర్ 9, (న్యూస్ పల్స్)
భద్రాచలం ఏజెన్సీలోని వ్యవసాయం కార్పొరేట్‍ఉచ్చుకు చిక్కింది. ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ప్రముఖ కంపెనీలు విచ్చలవిడిగా మన్యం లో విస్తరిస్తున్నాయి. గిరిజన చట్టా లను తుంగలో తొక్కి కార్పొరేట్ సంస్థలు వేగంగా విస్తరిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఒకవైపు రైతులను మోసగిస్తున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నా ఖద్దరు కనుసన్నల్లో దర్జాగా కార్పొరేట్ కాలర్ ఎగరేస్తోంది. ఒకప్పుడు సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసిన గిరిజన ప్రాంత రైతులు నేడు ఇష్టా రాజ్యంగా పురుగుమందులు పిచికారీ చేస్తూ పెట్టుబడులు పెంచుకుంటూ అప్పుల ఊబిలో దిగబడుతున్నారు. ఈ కార్పొరేట్ వ్యవసాయంలో బడా రైతులతో పోటీ పడలేక సన్నచిన్నకారు రైతులు డీలా పడిపోతున్నారు.
మిర్చితో పాటు దాదాపు రెం డు వేల ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు కూడా కార్పొరేట్ సంస్థలు చేపట్టాయి. ఈ రెం డు జిల్లాల్లో సుమారు నాలుగు బహుళజాతి సంస్థలు పోటీపడి రైతులను ఈ ఉచ్చులోకి దించుతున్నాయి. అయితే వీరు అంటగట్టిన విత్తనాలతో దిగుబడి సరిగ్గా రావడం లేదు. గతంలో వాజేడు మండలంలోని ఏడుచర్లపల్లిలో రైతులు పంటను తగలబెట్టారు. వెంకటాపురం మండలం పాత్రాపురం గోదావరి పాయలో పంట దిగుబడి రాక రైతులు నష్టపోయారు. కానీ వారికి పరిహారం మాత్రం ఇవ్వలేదు. సంప్రదాయ వ్యవసాయానికి గండికొట్టి కార్పొరేట్ వ్యవసాయం ఉచ్చులోకి దించుతున్న ఈ సంస్థ లు మన్యంలో సాగును ఛిద్రం చేస్తున్నాయి. సేంద్రీయ ఎరువులను రైతులు మరిచిపోతున్నారు.
కంపెనీలు ఇచ్చిన మందులు, ఎరువులతో భూముల్లో సారం తగ్గిపోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కార్పొరేట్ ఉచ్చు నుంచి ఏజెన్సీ వ్యవసాయాన్నికాపాడాలని పలువురు కోరుతున్నారు.
భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లాల పరిధిలో గోదావరి పరివాహక ప్రాంతంలోని నల్లరేగడి నేలల్లో పండించే మిర్చికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. సహజంగా నల్లరేగడి నేలలో సాగయ్యే మిర్చికి భిన్నంగా కార్పొరేట్ సంస్థలు సూచిం చిన పురుగుమందులు, ఎరువులతో పండిస్తున్నారు. రైతులతో ఒప్పం దం చేసుకుని వ్యవసాయం చేయిస్తున్నారు. దీన్ని బాండ్ వ్యవసాయం అంటారు. బయట మార్కెట్‍కం టే కొంచెం ఎక్కువ ధరకు మిర్చిని కొనుగోలు చేస్తామని ఒప్పందంలో పేర్కొంటున్నారు. లాభసాటిగా ఉండటంతో క్రమేపీ కార్పొరేట్‍ఉచ్చుకు చిక్కుతున్నారు. రెండు జిల్లాల సరిహద్దుల్లో ని గోదావరి పరివాహక ప్రాంతంలో సు
|
విచ్చలవిడిగా మన్యం లో విస్తరిస్తున్నాయి. గిరిజన చట్టా లను తుంగలో తొక్కి కార్పొరేట్ సంస్థలు వేగంగా విస్తరిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఒకవైపు రైతులను మోసగిస్తున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నా ఖద్దరు కనుసన్నల్లో దర్జాగా కార్పొరేట్ కాలర్ ఎగరేస్తోంది. ఒకప్పుడు సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసిన గిరిజన ప్రాంత రైతులు నేడు ఇష్టా రాజ్యంగా పురుగుమందులు పిచికారీ చేస్తూ పెట్టుబడులు పెంచుకుంటూ అప్పుల ఊబిలో దిగబడుతున్నారు. ఈ కార్పొరేట్ వ్యవసాయంలో బడా రైతులతో పోటీ పడలేక సన్నచిన్నకారు రైతులు డీలా పడిపోతున్నారు.