YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

అయోధ్య తీర్పు…రామజన్మభూమి న్యాస్ కే స్థలం

అయోధ్య తీర్పు…రామజన్మభూమి న్యాస్ కే స్థలం

 

అయోధ్య తీర్పు…రామజన్మభూమి న్యాస్ కే స్థలం
మసీదు కోసం ఐదేకరాలు కేటాయించాలని ఆదేశం
న్యూఢిల్లీ 
దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం ఒక ముగింపునకు వచ్చినట్లే. ఈ వ్యాజ్యంపై 40 రోజులపాటు రోజువారీ విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అక్టోబరు 16న తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ నెల  17న పదవీ విరమణ చేస్తున్నారు. ఈ  తీర్పుపై దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసింది. మా తీర్పు ఏకగ్రీవం, చారిత్రాత్మకంమని చీఫ్ జస్టీస్ వ్యాఖ్యానించారు. రామజన్మభూమి స్థలాన్ని రామజన్మభూమి న్యాస్ కు అప్పగిస్తూ సుప్రీం తీర్పు ఇచ్చింది. అదే సమయంలో అయోధ్యలో ప్రధాన స్థలంలో మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అయోధ్య యాక్ట్ కింద ఐదు నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయోధ్యలో ఖాళీ ప్రదేశంలో మసీదు కట్టలేదని అన్నారు. పురావస్తు పరిశోధనల ప్రకారం చూస్తే 12 శతాబ్దంలోనే అక్కడ ప్రార్థనా స్థలం ఉందని ఆయన అన్నారు. అయితే అది ఆలయం చెప్పడానికి ఆధారాలు లేవని ఆయన చెప్పారు. పురావస్తు పరిశోధనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. అక్కడి నిర్మాణం ఇస్లాం సంప్రదాయానికి అనుకూలంగా లేదని పురావస్తు శాఖ నివేదిక ఇచ్చిందని ఆయన అన్నారు.
వివాదస్పద భూమి మాదని షియా బోర్డు పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. ఈ భూమి గురించి సున్నీ, షియాల మధ్య వివాదం ఉన్న సంగతి తెలిసిందే. 
సహజంగా శనివారం కోర్టుకు సెలవు దినం. అయినప్పటికీ.. నేడే తుది తీర్పును ఇవ్వాలని నిర్ణయించింది అత్యున్నత న్యాయస్థానం. ధర్మాసనంలో చీఫ్ జస్టీస్ తో పాటు న్యాయమూర్తులు చంద్రచూడ్, అబ్దుల్ నజీర్, బోబ్టే, అశోక్ భూషన్ లు వున్నారు. ఎనిమిది ముఖ్యంశాలనూ తీర్పునిచ్చారు. 
ఈ తీర్పు వచ్చాక అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉండడంతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్కు కేంద్ర హోంశాఖ గురువారమే 40 కంపెనీల పారామిలటరీ బలగాలను తరలించింది. అయోధ్య తీర్పు నేపథ్యంలో. ఈ వ్యాజ్యాన్ని విచారిస్తున్న రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తుల భద్రతను పెంచారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కు జెడ్ ప్లస్ తరహా భద్రత, ఐదుగురు జడ్జీల నివాసాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. సుప్రీం కోర్టు భవనానికి కుడా ముడంచెల భద్రత కల్పించారు. శనివారం కేవలం పిటిఫన్ దారులను మాత్రమే అనుమతించారు.
మరోవైపు.. అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీమసీదుకు వెళ్లే అన్ని దారులనూ పోలీసులు మూసివేశారు. యూపీ సర్కారు అయోధ్యలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా పటిష్ఠమైన, బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు చేసింది. 60 కంపెనీల బలగాలను మోహరించింది. పరిస్థితిని పర్యవేక్షించడానికి 30 కీలక ప్రాంతాల వద్ద పోలీసులు 10 డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. తీర్పు నేపధ్యంలో శనివారం  ఢిల్లీ, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. యూపీలో విద్యాసంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు.

Related Posts