YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

శ్రీ రామదూత... క్షీరాబ్ధి ద్వాదశి వ్రతము..

శ్రీ రామదూత... క్షీరాబ్ధి ద్వాదశి వ్రతము..

శ్రీ రామదూత...
క్షీరాబ్ధి ద్వాదశి వ్రతము...
తేది : 09-11-2019, శనివారం...
రేపు " కార్తీక శుద్ధ ద్వాదశి " ని క్షీరాబ్ది ద్వాదశి అందురు. దీనినే చిలుక ద్వాదశి అని కూడా అంటారు. ఈ రోజున  మహా లక్ష్మికి శ్రీ మన్నారాయుణునికి వివాహము చేసెదరు.
వ్రత పూజా విధానము : ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి ,అలికి , బియ్యపు పిండితో గాని ,రంగుల చూర్ణములతో గాని ముగ్గులు పెట్టి ,దైవ స్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి .పీట మరీ ఎత్తుగా గాని ,మరీ పల్లముగా గాని ఉండకూడదు. పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి ,కుంకుమతో బొట్టు పెట్టి ,వరిపిండి (బియ్యపు పిండి ) తో ముగ్గు వేయాలి .సాదారణంగా అష్ట దళ పద్మాన్నే వేస్తారు. ఈ రోజున (క్షీరాబ్ది ద్వాదశి ) పద్మమును, శంఖమును, చక్ర ,పాదములు కూడా అలంకరించవలెను . పూజ చేసే వారు తూర్పు ముఖంగా కూర్చోవాలి .ఏ దైవాన్ని పూజించ బోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను గాని ,చిత్ర పటమును గాని ఆ పీటపై ఉంచాలి .ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి ) దానికి కుంకుమ బొట్టు పెట్టి పిదప ఒక పళ్ళెంలో గాని ,కొత్త తుండు గుడ్డ మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమల పాకు నుంచి ,అందు పసుపు గణపతినుంచి అగరువత్తులు వెలిగించాలి .ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి .దీపారాధన నైరుతి దిశలో చేయవలెను.
పూజకు కావలసిన వస్తువులు - దీపారాధన విధానము : దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద ) వెండిది గాని ,ఇత్తడిది గాని ,మట్టిది గాని వాడవచ్చును. కుందిలో 3 అడ్డ వత్తులు 1 కుంభ వత్తి (మధ్యలో )వేసి నూనెతో తడపవలెను . ఇంకొక అడ్డవత్తి నూనెతో తడిపి ఏక హారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువు ) వేసి ముందుగా ఏకహారతి లో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి ,వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డవత్తి 1 కుంభ వత్తి వెలిగించవలెను. తరువాత చేయి కడుక్కుని నూనె కుంది నిండా వేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాదనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను. కుందిలో మిగిలిన రెండు అడ్డ వత్తులు పూజా సమయములో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను .దీపారాధనకు నువ్వుల నూనె గాని ,కొబ్బరి నూనె గాని ,ఆవు నెయ్యి గాని వాడవచ్చును. ఈ విధంగా దీపం వెలిగించి గంటను వాయిస్తూ నమస్కరించి ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను

*ఘంటా నాదము :*
శ్లో || ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్
కుర్యాద్ఘంటార వం తత్ర దేవతా హ్వాహాన లాంచనమ్
మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించరాదు. పూజకు విడిగా ఒక గ్లాసు గాని ,చెంబు గాని తీసుకుని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించ వలెను. క్షీరాబ్ది ద్వాదశి రోజున దీపదానము అతి ముఖ్య మైనది . ఆ రోజు దీపదానము చేయువారు స్వర్గ ప్రాప్తిని పొందుదురు. దీపమునకు ఆవు నెయ్యి ఉపయోగించ వలెను అది దొరకనిచో మంచి నూనె వాడవచ్చును. ఆవు నెయ్యితో దీపము వెలిగించి దానము చేసినట్లయిన జ్ఞాన లాభములు మోక్ష ప్రాప్తి కలుగును.

పూజకు కావలసిన వస్తువులు :లక్ష్మీ
నారాయణుల యొక్క బొమ్మ (ప్రతిమ ) (తమ శక్తి కొలది బంగారముతో నైనను ,వెండితో
నైననూ లేక మట్టితో నైనను తీసుకొనవలెను ), లేదా చిత్ర పటము ,కొబ్బరికాయలు ,
బెల్లము, ఖర్జూరము, చెరకు, పళ్ళు ,పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం, హారతి 
కర్పూరం, అక్షతలు, అగ్గిపెట్టె , 
అగరువత్తులు,వస్త్ర,యజ్నోపవీతములు,ప్రత్యేక నివేదనకు పిండివంటలుమొదలగునవి. 
పిమ్మట యజమానులు (పూజ చేసేవారు ) ఈ దిగువ కేశవ నామాలను స్మరిస్తూ ఆచమనం 
చేయాలి .ఈ నామములు మొత్తం 24 కలవు.
1  ఓం కేశవాయ స్వాహా " అని చెప్పుకొని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి
2 . " ఓం నారాయణాయ స్వాహా "అనుకొని ఒకసారి
3 . " ఓం మాధవాయ స్వాహా " అనుకొని ఒకసారి జలమును పుచ్చుకోనవలెను .తరువాత
4 . " ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగు కోవాలి .
5 . " విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు , బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి .
6 . " ఓం మధుసూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
7 . "ఓం త్రివిక్రమాయ నమః " క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
8 ,9 ." ఓం వామనాయ నమః " " ఓం శ్రీధరాయ నమః " ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లు కోవాలి 
.10 . ఓం హృషీ కేశాయ నమః ఎడమ చేతిలో నీళ్ళు చల్లాలి .
11 .  ఓం పద్మనాభాయ నమః  పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లు కోవాలి .
12 . ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించు కోవలెను .
13 .ఓం సంకర్షణాయ నమః చేతి వ్రేళ్ళు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోనవలెను .
14 . ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకొనవలెను .
15 .16 . ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్దాయ నమః నేత్రాలు తాకవలెను .
17 .18 .ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాక వలెను
19 .20 ఓం నార సింహాయ నమః ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్పృశించ వలెను .
21 .ఓం జనార్ధనాయ నమః చేతి వ్రేళ్ళతో

వక్ష స్థలం , హృదయం తాకవలెను .
22 . ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను .
23
.24 .ఓం హరయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమ చేతి తోను , ఎడమ
మూపురమును కుడి చేతితోను ఆచమనం చేసిన తరువాత ఆచమనం చేసి ,వెంటనే సంకల్పము 
చెప్పుకోనవలెను .
ఆచమనము అయిన తరువాత ,కొంచెం నీరు చేతిలో పోసుకుని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకమును పటించవలెను .
శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః
  యేతేషామ విరోదేన బ్రహ్మ కర్మ సమారభే ||

*ప్రాణాయామమ్య:*
ఓం భూ : -ఓం భువః ఓం సువః - ఓం మహః -ఓం జనః ఓం తపః - ఓగ్ సత్యం -ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ దీయో యోనః ప్రచోదయాత్ - ఓం ఆపోజ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువ స్సువరోం అని సంకల్పము చెప్పు కొనవలెను.

*సంకల్పము :* 
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే అద్య బ్రాహ్మణః (ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు ) ద్వితీయ పరార్దె శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్బాగే శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీశైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీశైలమునకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను ), కృష్ణా గోదావర్యో : మధ్య ప్రదేశే (మనం ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను ), శోభన గృహే (అద్దె ఇల్లు ఐనచో వసతి గృహే అనియు , సొంత ఇల్లయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను ), సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిదౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన .......... సంవత్సరే , (ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగు చున్నదో ఆ సంవత్సరము యొక్క పేరు చెప్పుకొనవలెను. ) ......... ఆయనే , సంవత్సరమునకు రెండు ఆయనములు - ఉత్తరాయణము, దక్షిణాయనము . జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము , జూలై 15 కర్కాటక సంక్రమణము నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణము వరకు దక్షిణాయనం పూజ చేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను )...........ఋతు : (వసంత ,గ్రీష్మ , వర్ష మొ || ఋతువు లలో పూజ సమయములో జరుగుచున్న ఋతువు పేరు )............మాసే , (చైత్ర , వైశాఖ మొ || పన్నెండు మాసములలో పూజాసమయంలో జరుగు చున్న మాసం పేరు ) .......పక్షే , (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము , అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుచున్న సమయమున గల పక్షము పేరు ) ........తిధౌ , (ఆరోజు తిది ) .........వాసరే (ఆ రోజు ఏ వారమైనది చెప్పుకొని ) శుభ నక్షత్రే , శుభయోగే ,శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిధౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్ ...........గోత్రస్య ........నామధేయః, శ్రీమత్యః , గోత్రస్య ,నామదేయస్య అనియు, స్త్రీలైనచో శ్రీమతి , గోత్రవతి , నామదేయవతి, శ్రీమత్యాః ,గోత్ర వత్యాః, నామధేయవత్యాః , అనియు (పూజచేయువారి గోత్రము , నామము చెప్పి ) నామదేయస్యః ధర్మపత్నీ సమేతస్యః (పురుషులైనచో ) మమ సహ కుటుంబస్య ,క్షేమ స్థైర్య, వీర్య , విజయ ,అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ద్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం , పుత్ర పౌత్రాభి వృధ్యర్ధం,సకల విధ మనోవాంచాఫల సిద్ద్యర్ధం , శ్రీ తులసీ ధాత్రి సహిత శ్రీ లక్ష్మీ నారాయణ దేవతా ప్రీత్యర్ధం (ఏ దేవుని పూజించు చున్నామో ఆ దేవుని యొక్క పేరు చెప్పుకుని ) క్షీరాబ్ధి శయన వ్రతాభ్యాం కర్మ కరిష్యే . సంభవ ద్భిరుపచారై: సంభవతానియమేన సంభవతాప్రకారేణ యావచ్చక్తి (నాకు తోచిన రీతిలో ,నాకు తోచిన నియమములతో , నాకు తోచిన విధముగా ,భక్తి శ్రద్దలతో సమర్పించు కుంటున్న పూజ ) ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే .ఆదౌ నిర్విఘ్నేన పరి సమాప్యర్ధం గణాధిపతి పూజాం కుర్యాత్. తతః తులసి ధాత్రి సహిత లక్ష్మీ నారాయణ దేవతా ముద్దిశ్య తులసి ధాత్రి సహిత లక్ష్మీ నారాయణ దేవతా ప్రీత్యర్ధం కల్పోక్త విధానేన యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే || పిదప కలశారాదనను చేయవలెను.


కలశ పూజను గూర్చిన వివరణ : వెండి,
రాగి , లేక , కంచు గ్లాసులు (లేదా పంచ పాత్రలు ) రెండింటిలో శుద్ధ జలమును 
తీసుకుని ఒక దానియందు అక్షతలు , తమలపాకు ,పువ్వు ఉంచుకొనవలెను. రెండవ 
పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను అద్దవలెను ఇట్లు 
చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమును కాని , కుంకుమను గాని 
పూయరాదు. గంధమును ఉంగరపు  వ్రేలితో పూయవలెను. కుంకుమ అక్షతలు వగైరా బొటన, 
మధ్య, ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించ వలెను. యజమానులు (ఒక్కరైతే ఒకరు, 
దంపతులైతే ఇద్దరూను ) ఆ కలశాన్ని కుడి చేతితో మూసి వుంచి ఇలా అనుకోవాలి .
ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదువవలెను .
మం || కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్ర స్సమాశ్రితః
      మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత
ృ గణా స్మృతాః ||
      ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
      అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితః
శ్లో || గంగైచ యమునే చైవ కృష్ణే ,గోదావరి ,సరస్వతి ,నర్మదా సింధు
  కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు.
ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీ తులసీ ధాత్రి సహిత శ్రీ లక్ష్మీ 
నారాయణ పూజార్ధం దురితక్షయ కారకాః (ఏ దేవుని పూజిస్తున్నామో ఆ దేవుని పేరు 
చెప్పవలెను ) కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య  (కలశ మందలి ఉదకమును దేవునిపై 
చల్లాలి) ,ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి ) ఓం 
పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి ) కలశ మందలి 
నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని ,ఆకుతో గాని చల్లాలి .
మార్జనము : ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్తాం గతోపివా
                యస్మరే త్పుండరీ కాక్షం సభాహ్యాభ్యంతర శ్శుచి :||
అని
పిదప కాసిని అక్షతలు ,పసుపు, గణపతిపై వేసి ,ఆయనను తాకి నమస్కరించి ప్రాణ 
ప్రతిష్టాపన చేయవలెను. ప్రాణ ప్రతిష్ట అనగా శ్రీ తులసీ ధాత్రి సహిత శ్రీ 
లక్ష్మీ నారాయణ ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తోస్తు తధాస్తు . 
స్థిరోభవ, వరదోభవ ,సుముఖోభవ ,సుప్రసన్నోభవ. తరువాత ఇలా చదువుతూ 
విఘ్నేశ్వరునికి నమస్కరించవలెను .

శ్లో || శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
  ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే ||

  సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజ కర్ణక :
  లంబోరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః
  ధూమ కేతు ర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః
  వక్ర తుండ శ్శూర్ప కర్ణో హీరంభః స్కంద పూర్వజః
  షోడ శైతాని నామాని యః పటే చ్చ్రుణు యాదపి
  విద్యా రంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా
  సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్త స్యన జాయతే ||
పిదప
షోడశోపచార పూజను చేయవలెను. షోడశోప చారములనగా ఆవాహన ,ఆసనం, అర్ఘ్యం ,పాద్యం
,ఆచమనీయం ,స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, 
నైవేద్యం, తాంబూలం, నమస్కారం ,ప్రదక్షణములు మొదలగునవి.

Related Posts