శ్రీ రామదూత...
*_12 - 11 - 2019 , మంగళవారం, పౌర్ణమి రోజున పవిత్రమైన నదిలో స్నానం చేస్తే వచ్చే ఫలితాలేంటో తెలుసా_*
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమినే కార్తీక పౌర్ణమి అంటారు. ఈ కార్తీక పౌర్ణమి అంటే దాదాపు మహాశివరాత్రి పండుగతో సమానం అని చెప్పొచ్చు. ఈ పౌర్ణమితో పాటు ఈ మాసం అంటే భోళా శంకరుడికి అత్యంత ప్రీతికరం. అలాగే
శ్రీ మహావిష్ణువుకు ఈ మాసం అంటే అమితమైన ప్రేమ అని పురాణాల్లో చెప్పబడింది. అన్ని మాసాలకంటే కార్తీక మాసం అనేది ఒక ప్రత్యేకత కలిగిన మాసం అని పురాణాలు, వేదాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 12వ తేదీన మంగళవారం నాడు వస్తుంది.
చంద్రుడు చిత్త నక్షత్రంతో ఉంటే చైత్రమని, విశాఖ నక్షత్రంలో ఉంటే వైశాఖమని, అలాగే కృత్తిక నక్షత్రంతో కలిసి ఉంటే కార్తీక మాసం అని అంటారు. హిందువులకు ఆధ్యాత్మికంగా చూస్తే ఈ సంవత్సరం ఇదే చివరి పండుగ అవుతుంది. ఇక ఈ పౌర్ణమి రోజున పవిత్రమైన నదిలో పవిత్ర స్నానం చేసి పొరపాటున చేసిన పాపాలను కడిగివేయచ్చని పురాణాలలో పేర్కొనబడింది. వీటిని హిందువులందరు చాలా ఎక్కువగా నమ్ముతారు. ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి గురించి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం.
*వృషభం_గుర్తులోకి_చంద్రుడి_ప్రవేశం*
కార్తీక పౌర్ణమి రోజున వృషభం గుర్తులోకి చంద్రుడు ప్రవేశిస్తాడు. అదే రోజు సూర్యుడు మరియు చంద్రుడు రెండింటి కిరణాలు గంగా నది నీటిపై నేరుగా పడతాయి. అందువల్ల ఈ రోజు ఆధ్యాత్మికంగా స్వచ్ఛమైనదిగా భావించబడుతుంది. అలాగే ఈ రోజున ఆకాశం నుండి తేనే వర్షం కురుస్తుందని అంటారు. ఈ సంవత్సరం గంగా స్నానం చేసే వారికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి.
*లక్ష్మీ_దేవికి_స్వాగతం*
హిందువులలో చాలా మంది సంపదను సంపాదించడానికి లక్ష్మీదేవి పూజను పవిత్రంగా భావిస్తారు. అందుకే చాలా మంది లక్ష్మీ దేవికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇంటిని సరిగ్గా పరిశుభ్రం చేసుకుంటారు. అలాగే ఇంటి ముందు, ప్రధాన ద్వారాలకు అలంకరణలు చేస్తారు. అలాగే ప్రవేశ ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తులను వేస్తారు. దీని వల్ల మీరు లక్ష్మీదేవి ఆహ్వానాన్ని మన్నించి ఇంట్లోకి వస్తుందని చాలా మంది నమ్ముతారు. అలాగే ఆమె ఆశీర్వాదాన్ని పొందవచ్చు.
*సానుకూల_ప్రభావం*
కార్తీక మాసంలో పౌర్ణమి రోజున చంద్రుని చూడటం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే దాని దృష్టి మీపై దైవిక సానుకూల ప్రభావాలను చూపుతుంది. ఈ విషయాన్ని చాలా మంది హిందువులు నమ్ముతారు. ఈరోజు సాయంత్రం ఒక ప్రసాదం చేసి బయట సమర్పించాలి.
*దీపరాధన*
కార్తీక పౌర్ణమి రోజున నదిలో స్నానం చేసిన తర్వాత నది ఒడ్డున దీపారాధన చేయాలి. ఇది చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఇది మీ జీవితంలో వచ్చే అదృష్టాన్ని పెంచుతుంది.
*సత్యనారాయణ_పూజ*
విష్ణువు యొక్క మరో రూపమే సత్యనారాయణ రూపం. ఆ రోజున లక్ష్మీదేవితో పాటు సత్యనారాయణ పూజను చేస్తారు. ఈ పూజ సందర్భంగా సత్యనారాయణ మార్గం అనే మార్గం గురించి పండితులు వివరిస్తారు. అలాగే తులసిని కూడా పూజిస్తారు.
*ఆలయాల్లోనూ_జ్యోతులు*
కార్తీక పౌర్ణమి రోజున దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజున శివుడు, విష్ణు దేవాలయాలు రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలమీద,బియ్యం పిండితో చేసిన ప్రమీదలలో దీపాలు వెలిగించాలి.