YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

దేశమంతా హై అలెర్ట్

దేశమంతా హై అలెర్ట్

దేశమంతా హై అలెర్ట్
న్యూఢిల్లీ, 
దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపబోయే కీలక అయోధ్య భూవివాదం కేసులో అత్యున్నత న్యాయస్థానం  తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా అయోధ్య, యూపీలోని కీలక ప్రాంతాల్లో భారీగా పారామిలటరీ దళాలను మోహరించారు. ఆయోధ్య పరిసర ప్రాంతాల్లో దాదాపు 20 వేల మందిని భద్రతకు నియమించారు ముందు జాగ్రత్త చర్యగా ఉత్తరప్రదేశ్ సహా ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో విద్యాసంస్థలకు సోమవారం వరకు సెలవులు ప్రకటించగా, రాజస్థాన్, కర్ణాటక, జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వాలు కూడా పాఠశాలలకు శనివారం సెలవులు ప్రకటించాయి.భరత్‌పూర్‌ సహా మరికొన్ని సున్నితమైన ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు రాజస్థాన్‌ ప్రభుత్వం పేర్కొంది. అలాగే జైసల్మేర్‌లో నవంబరు 30 వరకు 144వ సెక్షన్‌ విధిస్తున్నట్లు వెల్లడించారు.తీర్పు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయోనని భావించిన ప్రజానీకం నిత్యావసరాలను ముందుగానే కొనుగోలు చేసుకున్నారు. ఏటీఎంల వద్ద కూడా బారులు తీరారు. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమైతే ఇబ్బందులు తప్పవని ఆహారం, మందుల, ఇంధనం తదితరాలను కొనుగోలు చేస్తున్నారు.తీర్పు నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులను అందుబాటులో ఉండాలని ఆదేశించింది. స్థానిక పోలీసులతో కలిసి సమన్వయం చేసుకోవాలని తెలిపింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఏదైనా అనుకోని ఘనటలు చోటుచేసుకుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కేస్‌ఆర్టీసీ సిబ్బందిని ఆదేశించింది
అయోధ్య తీర్పు ఏ పక్షం కాదు : ప్రథాని
నిర్మోహి అఖాడాలు సంతోషం 
.ప్రధాని మోదీ చెప్పినట్లు అయోధ్య తీర్పు ఏపక్షానికి విజయమూ కాదని.. ఓటమి కాదని అయోధ్యలో రామాలయ ప్రధాన పూజారి మహంత్‌ సత్యేంద్ర దాస్‌ అన్నారు. . తీర్పుని గౌరవించి ప్రతిఒక్కరూ శాంతియుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా గౌరవించాలని, ఎలాంటి వదంతులను, వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియా సహ తదితర మాధ్యమాల్లో వ్యాపింపజేయవద్దని ప్రజలకు ఉత్తరాఖండ్ సీఎం త్రివేది సింగ్ రావత్ విజ్ఞప్తి చేశారు.తీర్పును వెలువరిస్తున్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్.. అయోధ్య వివాదంపై షియా వక్ఫ్ బోర్డు వేసిన పిటిషన్‌ను ఏకాభిప్రాయంతో కొట్టివేశారు.తీర్పుతో భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిందని హిందూ మహాసభ లాయర్‌ వరుణ్‌ కుమార్‌ సిన్హా అన్నారు.2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని ఆదేశించింది. ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు చెప్పింది.సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన సున్నీ వక్ఫ్ బోర్డ్ కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని పేర్కొంది.అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పు తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యాఖ్యానించింది.సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి తాము అనుకూలమేనని కాంగ్రెస్‌ పార్టీ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలా అన్నారు. ఈ తీర్పుతో ఆలయ నిర్మాణానికి తలుపు తెరుచుకున్నాయని, బీజేపీకి తలుపులు మూసుకుపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇక అయోధ్య విషయం రాజకీయ రంగు పులుముకోదని సుర్జేవాలా పేర్కొన్నారు.రామ జన్మభూమి విషయంలో గత 150 ఏళ్లుగా తాము చేస్తున్న పోరాటాన్ని సుప్రీంకోర్టు గుర్తించిందని నిర్మొహి అఖాడా పేర్కొంది. రామమందిర నిర్మాణానికి, నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ట్రస్ట్‌లో నిర్మోహి అఖారాకు తగిన ప్రాతినిధ్యం ఉంటుందని ఆ సంస్థ అధికార ప్రతినిధి అన్నారు.

Related Posts