ప్రజారోగ్య మే ప్రభుత్వ ధ్యేయం
- మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి
రాష్ట్రంలోని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసమే అనారోగ్యం బారిన పడిన వారికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన చెక్కులను, ఎల్ వో సి పత్రాలను అందజేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం జిల్లా కేంద్రం లోని తన నివాసంలో అనారోగ్యం బారిన పడినవారికి చెక్కులను, ఎల్వోసీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రేవల్లి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన చంద్రకళ కు రెండు లక్షల రూపాయల చెక్కును ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. అదేవిధంగా వెల్టూరు కు చెందిన చందుకు 2 లక్షల 50 వేల ఎల్ ఓ సి, శ్రీనివాసపురం కు చెందిన సుదర్శన్ కు లక్ష ఎల్ వో సి, కిల్ల ఘణపూర్ చెందిన కు సంజమ్మ కు 27000ఎల్ వో సి ని అందజేసి నంతరం వనపర్తికి చెందిన పీర్య 15000, వనపర్తి కి చెందిన రుబీనా బేగం కు 20000, నాగసాని పల్లి కి చెందిన ది జయరాముడు 20000, మెట్టుపల్లి చెందిన మాధవికి 15000, వనపర్తి చెందిన రమేష్ కు 60000, వెంకటాపూర్ కు చెందిన మన్నెమ్మ కు 17500 వనపర్తికి చెందిన గోవిందు కు 9500 కాసిం నగర్ కు చెందిన పార్వతికి 11000, రూపాయల చెక్కులను మంత్రి అందజేశారు.